రామచంద్రాపురం, మే 1: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తుందని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. శనివారం రాత్రి భారతీనగర్ డివిజన్లోని ఓల్డ్ ఎంఐజీలో 16.5 కిమీ మేర నూతన తాగునీటి పైప్‌లైన్ పనులకు ఆయన డివిజన్ కార్పొరేటర్ సింధూఆదర్శ్‌రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో కలిసి శంకుస్థాపన చేశా రు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మిషన్ భగీరథతో రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తున్నామన్నారు. వేసవి వస్తే జంటనగరాల్లో నీటి సమస్యలు తాండవం చేసేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. గ్రావిటీ ప్రకారం ఇంటింటికీ తాగునీరు వస్తున్నాయన్నారు. కలుషిత నీటి సమస్య లేకుండా ప్రతి ఇంటికీ 20వేల లీటర్ల వరకు ప్రభుత్వం ఉచితంగా తాగునీటిని సరఫరా చేస్తుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి పరిధిలోని ఉన్న ఓల్డ్ ఎంఐజీని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ప్రాం తంలో నూతన తాగునీటి పైప్‌లైన్ పనులు చేపట్టాలని కార్పొరేటర్ సింధూఆదర్శ్‌రెడ్డి పలుమార్లు తమ దృష్టికి తీసుకువచ్చారని, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు సహకారంతో 16.5 కిమీల మేర పైప్‌లైన్ పనులకు శంకుస్థాపన చేసుకున్నామన్నారు. అంతకుముందు ఎంఐజీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.5 లక్షల చెక్కుని చందానగర్ సీఐ క్యాస్ట్రోరెడ్డికి ఎమ్మెల్యే అందజేశారు. కార్యక్రమంలో వటర్ వర్క్స్ జీఎం రాజశేఖర్, మేనేజర్ సుబ్రహ్మణ్యం, బల్దియా ఈఈ శ్రీనివాస్, ఎస్ఐ వెంకటేశ్, మాజీ కౌన్సిలర్ మోహన్‌గౌడ్, మాజీ సర్పంచ్ రాజేశ్వర్‌రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు బూన్ తదితరులు పాల్గొన్నారు.
ఎంఐజీలో ఇఫ్తార్..
భారతీనగర్ డివిజన్లోని ఓల్డ్ ఎంఐజీలో ఉన్న మసీద్‌లో కార్పొరేటర్ సింధూఆదర్శ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ఇఫ్తార్ విందుకు చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. అనంతరం ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం ఇఫ్తార్ విందుని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ముస్లింలు రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.