రామాయంపేట, ఏప్రిల్ 30 : ఆశ వర్కర్లు, ఏఎన్ఎంలు ప్రభుత్వ వైద్య సిబ్బంది మొత్తం ప్రజలకు అందుబాటులో ఉండి జిల్లావ్యాప్తంగా మాతాశిశు మరణాలను తగ్గించాలని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్రావు సూచించారు. శనివారం రామాయంపేటలోని ఎంపీపీ అతిథి గృహంలో ఆశ వర్కర్ల దినోత్సవం సందర్భంగా వైద్య సిబ్బందితో సమావేశం ఏర్పా టు చేసి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆశ వర్కర్లు గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్యసేవలు అందించాలన్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉందని గర్భి ణులు, బాలింతలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేయాలన్నారు. ఉపాధి పనులు చేసే కూలీలకు అందుబాటులో ఉండి పనిచేసి అలసిపోయే వారిని గుర్తించి ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు తాగునీటిని అందించాలని ఆయన సూచించారు.
సబ్సెంటర్లకు వచ్చేవారికి ప్రతిరోజూ బీపీ, షుగర్ పరీక్షలు చేసి, సూచనలు ఇవ్వాలని సూచించారు. గ్రామాల్లో గర్భిణుల పేర్లు నమోదు చేసుకుని, వారి ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టా లన్నారు. ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రసవాలు జరిగేలా అవగా హన కల్పించాలన్నారు. ఇచ్చిన టార్గెట్ను పూర్తి చేయాలని ఆశవర్కర్లను ఆదేశించారు. రక్తహీనత నివారణకు గర్భిణు లకు ఐరన్ మాత్రలను పంపిణీ చేయాలన్నారు. కార్యక్రమం లో రామాయంపేట ప్రభుత్వ వైద్యులు ఎలిజబెత్రాణి, డెమో అధికారి పాండురంగాచారి, మలేరియా అధికారి కుమారస్వామి, హెచ్ఈవో కరిపె రవీందర్, పీహెచ్ ఏఎన్ఎం సత్త మ్మ, సూపర్వైజర్లు సునంద, ఉజ్వల, శామల ఉన్నారు.