రామాయంపేట, ఏప్రిల్ 25: రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామానికి చెందిన విఠల్ పర్సు రామాయంపేట బస్టాండులో బస్సు దిగుతుండగా పర్సు కిందపడి పోయింది. రామాయంపేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఎస్సై రాజేశ్‌కు ఫిర్యాదు చేశాడు. ఎస్సై రాజేశ్ సీసీ పుటేజీని పరిశీలించడంతో.. మేడ్చల్ డిపో బస్సు డ్రైవర్‌కు దొరికినట్లు సీసీ పుటేజీలో లభ్యమైంది. వెంటనే డిపోకు ఎస్సై ఫోన్ చేశాడు. దీంతో వెంటనే ఎస్సై డ్రైవర్‌కు ఫోన్‌చేసి పర్సు విషయం తెలిపాడు. చేగుంట పోలీసులు బస్టాండ్‌కు వెళ్లి పర్సును తీసుకున్నారు. ఎస్సై ప్రకాశ్‌గౌడ్ తన సిబ్బందితో రామాయంపేటకు చేరుకుని పర్సును బాధిత కుటుంబానికి అందజేశారు. పర్సులో రెండు తులాల బంగారు గొలుసు, నగదు మూడు వేలు ఉన్నట్లు తెలిపారు. పర్సు దొరడంతో బాధిత కుటుంబం రామాయంపేట, చేగుంట పోలీసులకు, ఆర్టీసీ డ్రైవర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.