మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 21 : ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని వైద్యులకు మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ సూ చించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ‘సిజేరియన్ ఆపరేషన్ వద్దు-సాధారణ కాన్పు ముదు’్ద అంశంపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వ ర్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖాన వైద్యులు, గైనకాలజిస్టులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభు త్వం సాధారణ కాన్పులపై ప్రత్యేక దృష్టి సారించిందని, తల్లి, బిడ్డ క్షేమం కోసం 85 శాతం సాధారణ కాన్పులు జరిగేలా చూడాలని లక్ష్యాన్ని నిర్ధేశించిందన్నారు. జిల్లా లో ప్రభుత్వ దవాఖానల్లో 40 శాతం సాధారణ కాన్పు లు జరుగుతున్నా, 34 ప్రైవేట్ దవాఖానల్లో కేవలం నాలుగైదు మినహా మిగతా దవాఖానల్లో సిజేరియన్ చేస్తున్నట్లు వివరించారు. తల్లీబిడ్డకు ప్రాణాపాయం ఉంటే తప్ప సిజేరియన్‌కు వెళొద్దని, కనీసం 50 శాతం పైగా సాధారణ ప్రసవాలు జరిగేలా వైద్యులు కృషి చేయాలని సూచించారు.
వైద్యులు నైతిక విలువలలు పాటిస్తూ వృత్తి ధర్నాన్ని నిర్వహించాలన్నారు. గర్భిణులు కాన్పు విషయంలో సహకరిస్తే సాధారణ ప్రస వం చేయడానికి వీలుంటుందన్నారు. అవగాహన లేనివారికి సిజేరియన్ చేస్తే వచ్చే అనర్థాలు, దీర్ఘకాల ఆరోగ్య సమస్యలు, సాధారణ కాన్పు ప్రయోజనాలు వివరించాలని సూచించారు. ప్రతి వైద్యుడు సాధారణ ప్రసవాలు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. మూడు నెలల అనంతరం సమీక్షించి, పురోగతి లేని దవాఖానలపై వేటు వేస్తామన్నారు. సాధారణ ప్రసవాలపై డాక్టర్ సుమిత్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇ చ్చారు. సమావేశంలో జిల్లా వైధ్యాధికారి వెంకటేశ్వర్రావు, జిల్లా దవాఖాన సూపరింటెండెంట్ చంద్రశేఖర్, శివదయాల్, ప్రైవైట్ దవాఖానల వైద్యులు సు రేందర్, సూఫీ, స్త్రీ వైద్యనిపుణులు పాల్గొన్నారు.