హవేళీఘనపూర్, ఏప్రిల్ 14 : యాసంగిలో పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్న ప్రకటనతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. గురువారం హవేళీఘనపూర్ మండలం లోని ఔరంగాబాద్తండాలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రైతుల సంక్షేమాన్ని కేంద్ర ప్ర భుత్వం పట్టించుకోనప్పటికీ.. మన రైతులకు ఇబ్బంది కలుగకుం డా ధాన్యం కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారని తెలిపారు. సీఎం కేసీఆర్ హామీతోనే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోనే మొదటిసారిగా ఔరంగాబాద్తండాలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొ న్నారు. రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా ప్రభుత్వం ఏ ర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు. రైతులకు అవసరమైన గన్నీసంచు లు కూడా అందుబాటులో ఉంచుతున్నట్లుతెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రమేశ్, ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, వైస్ ఎంపీపీ రాధాకిషన్‌యాదవ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు సోములు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ఏవో నాగమాధురి, ఎంపీటీసీ రాజయ్య, నేతలు శ్రీనివాస్, ఫూల్సింగ్, అజ్మీరా స్వామినాయక్, శ్రీనునాయక్ పాల్గొన్నారు.