మెదక్ రూరల్, ఏప్రిల్ 12 : ఎండల్లో తిరిగి బేజారువుతున్నా ప్రజలకు దాహార్తిని తీరుస్తున్నాయి చలివేంద్రాలు. మెదక్ పట్టణంలో గ్రామ పంచాయతీలో వివిధ స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చలి వేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీరుస్తు ఉపశమనం కల్గిస్తూన్నారు చలివేంద్రాల నిర్వహకులు.
పట్టణంలో ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. దీంతో ఎండల నుంచి ఉపశమనం పొందడానికి చలివేంద్రాలు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఆరోగ్యానికి ఉపయోగపడేలా మట్టి కుండల్లో నీరు సహాయపడుతున్నాయి. దీంతో పాటు చల్లటి నీటి వలన శరీరంలోని ఉష్ణోగ్రతను సమతాస్థితిలో ఉండే లా, వడ దెబ్బ నుంచి రక్షణ పొందేలా ఉపయోగపడుతున్నాయి. మెదక్ జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండల కేంద్రాలు, గ్రామాల్లోనూ అనేక చలివేంద్రాలను నెలకొల్పుతు న్నారు. మెదక్ పట్టణం జిల్లా కేంద్రం కావడంతో మెదక్‌తో పాటు పరిసర ప్రాంతాల నుంచి మెదక్ వచ్చిన ప్రజలకు, ఇతర ప్రాంతాలకు వెళ్తున్న ప్రయాణికులకు చలివేంద్రాలు దాహార్తిని తీరుస్తున్నాయి. చలివేంద్రాలతో పాటు అంబలి కేంద్రాలను ఏర్పాటు చేశారు వీటి నిర్వాహకులు.
ఈ చలివేంద్రాలను స్వచ్ఛంద సంస్థలు ప్రజలు అధికంగా సంచరించే చోట్ల, మార్కెట్ ప్రాంతాల్లో, బస్టాండ్, పాఠశాలలు, వ్యాపార ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద చలివేంద్రాలను నెలకొల్పారు. ప్రజలు నీటిని తాగుతూ ఎండ నుంచి రక్షణ పొందుతున్నారు.
ఎండ నుంచి ఉపశమనం కల్గిస్తోంది: బాలయ్య టీఆర్ఎస్ నాయకుడు
రోజు రోజు ఎండలు మండుతున్న తరుణంలో ప్రయాణికులకు, వాహనదారులకు చలివేంద్రాల చల్లటి నీటి ద్వా రా ఉపశమనం పొందుతున్నారు. స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలను ఏర్పాటు చేయడం అభినందనీయం.