మెదక్, ఏప్రిల్ 10 : బడుగు, బలహీన వర్గాల అ భ్యున్నతి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిబాఫూలే అని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి పేర్కొ న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి, వారి విద్యాభివృద్ధి కోసం కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త, మానవతావాది అని ఫూలే సేవలను గుర్తు చేశారు. కుల, లింగ వివక్షతకు తావు లేకుండా అన్ని వర్గాలకు విద్య అందించాలని, విద్య ద్వారానే బలహీన వర్గాలు, సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని ఫూలే భావించార ని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. అంటరానితం, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి అన్నారు. మహిళలు చదువుకుంటేనే సామాజిక అసమానతలు తీరుతాయని అన్నారు. మొదటగా సావిత్రీబాయిని విద్యావంతురాలిని చేసి, ఆమె ద్వారా వందలాది మంది మహిళలతో అక్షరాలు దిద్దించిన ఘనత ఫూలే దంపతులదని ఎమ్మెల్సీ సుభాష్‌రెడ్డి కొనియాడారు. సమాజ పునర్నిర్మాణానికి ఫూలే చేసిన కృషి చిరస్మరణీయమని, ఫూలే ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యతతో కూడి న విద్యను అందిస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే బలహీన వర్గాలకు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రభు త్వం అమలు చేస్తుందని పేర్కొన్నారు. వెనకబడిన బడుగు, బలహీన వర్గాలు ఈ అవకాశాలను అందింపుచ్చుకొని విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో మరింతగా ఎదిగి స్థిరపడడమే ఫూలే దంపతులకు నిజమైన నివాళి అని ఎమ్మెల్సీ పేర్కొన్నారు.