మెదక్ రూరల్, ఏప్రిల్ 9 : ప్రతి ఏటా చైత్ర మాసం శుక్లపక్షం నవమి నాడు శ్రీరాముడు జన్మించిన రోజునే దేశవ్యాప్తంగా శ్రీ రామనవమి పండగను నిర్వహిస్తారు. రావణుడ్ని సంవరించి తిరిగి అయోధ్యకు చేరుకున్న రోజు కూడా ఇదే. సీతారాముల కల్యాణాన్ని నవమి రోజునే నిర్వహిస్తారు. మరుసటి రోజు శ్రీ రామ పట్టాభిషేకమహోత్సవం జరుగుతుంది. శ్రీరామ నవమి పురస్కరించుకుని గ్రామాల్లోని శ్రీరామాలయాలను రంగురంగు విద్యుద్దీపాలతో అలంకరించారు. ఆలయాల్లో రెండు రోజులుగా పట్టువస్తాలు, ముత్యాల తలంబ్రాల తయారీ చేపట్టారు.
శ్రీరామనవమికి ముస్తాబైన దేవాలయాలు
అఖిలాండకోటి బ్రహ్మండనాయకుడు శ్రీరామచంద్రుడి కల్యాణం సందర్భంగా రామాలయాలను ముస్తాబు చేశారు. రామాయంపేట మండలంలోని రాయిలాపూర్, దామరచెర్వు, అక్కన్నపేట, జాన్సీలింగాపూర్, తొనిగండ్ల, కాట్రియాల, దంతేపల్లి, కోనాపూర్ గ్రామాల్లోని రామాలయంతోపాటు హనుమాన్ దేవాలయాలను అందంగా అలంకరించారు. ఆదివారం సీతారాముల కల్యాణ ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు.
పెద్దశంకరంపేట రామాలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. సీతారాముల కల్యాణానికి భక్తులు హాజ రై జయప్రదం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.
ఘనంగా సీతారాముల పల్లకీసేవ
శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా పెద్దశంకరంపేటలో రామమందిరం నుంచి పట్టణ వీధుల్లో సీతారాముల పల్లకీసేవ నిర్వహించారు. సీతారాముల విగ్రహలను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీపై పట్టణంలో ఊరేగించారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, సర్పం చ్ అలుగుల సత్యనారాయణ, ఆలయ కమిటీ అధ్యక్షుడు గుజ్జరి కనకరాజు, సభ్యులు కందుకూరి రవీందర్, సీతారామరావు, సతీశ్‌గౌడ్, సిద్ధ్దు, వెంకటేశం, పున్నయ్య, సర్వేశ్వర్, శ్రీను, సత్యనారాయణ పాల్గొన్నారు.
వైభవంగా వేంకటేశ్వరస్వామి ప్రతిష్ఠాపన
మండలంలోని చల్మెడలో సర్పంచ్ నంధ్యాల నర్సింహారెడ్డి అధ్వర్యంలో వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలను నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని గ్రామంలో ఊరేగించారు. గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు.
ప్రసన్నాంజనేయస్వామి ఉత్సవాలకు ఆర్థికసాయం
మండలంలోని పిల్లుట్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపనకు రూ. 50వేల నగదును జడ్పీటీసీ మహేశ్‌గుప్తా సర్పంచ్ పెద్దపులి రవి సమక్షంలో అందజేశారు. చెన్నాపూర్‌లో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ఠాపన కోసం జడ్పీటీసీ మహేష్‌గుప్తా తనవంతుగా రూ. 20 వేల ఆర్థికసాయాన్ని సర్పంచ్ బోళ్ల భారతీభిక్షపతికి అందజేశారు. ఇటీవల మృతి చెందిన వడ్డె బంగారయ్య కుటుంబానికి రూ.5వేల ఆర్థికసాయాన్ని జడ్పీటీసీ అందజేశారు. రెడ్యాతండాకు చెందిన క్రీడాకారులకు వాలీబాల్ కిట్టు అందజేశారు. కార్యక్రమాల్లో రైతుబంధు సమితి మాజీ మండలాధ్యక్షుడు నర్సింహారెడ్డి, భర్మస్వామి ఆలయ కమిటీ చైర్మన్ రాఘవారెడ్డి, బబ్బురి వెంకటేశ్, చెన్నాపూర్ ఉప సర్పంచ్ ప్రభాకర్‌రెడ్డి, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు రామచందర్‌గౌడ్, నేతలు శ్రీనివాస్‌రెడ్డి, సత్తియాద్, ఆంజనేయులు ఉన్నారు.
భగళాముఖి ఆలయానికి విరాళం అందజేత
శివ్వంపేటలో భగళాముఖి అమ్మవారి ఆలయ నిర్మాణానికి నటరాజ్‌గౌడ్ రూ.11వేలు, టీఆర్ఎస్ చెన్నాపూర్ గ్రా మాధ్యక్షుడు రామచందర్‌గౌడ్ రూ.11వేలను అందజేశారు. కార్యక్ర మంలో సర్పంచ్ శ్రీనివాస్‌గౌడ్, భగళాముఖి ఆలయ ట్రస్టు సభ్యుడు వామనశర్మ, ఉపసర్పంచ్ పద్మావెంకటేశ్ ఉన్నారు.
ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు
శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల పంచాయతీ పరిధిలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన చాకరిమెట్ల సహకార ఆంజనేయస్వామి దేవాలయంలో హైకోర్టు సీనియర్ న్యాయవాది, ప్రసాద్ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ శివకుమార్‌గౌడ్, రమాదేవి దంపతులు డాక్టర్ సురభి శ్రీనివాస్‌గౌడ్ ఇందిరతో కలిసి స్వామివా రిని దర్శించుకున్నారు. మన్యసూక్త పారాయణం, అభిషేకం పూ జలు నిర్వహించారు. అనంతరం ఆలయ ఫౌండర్, చైర్మన్ భా స్కరరాయిని ఆంజనేయశర్మ తీర్థప్రసాదాలు అందజేశారు.