పాపన్నపేట, మార్చి 28 : సహకార సంఘాలకు సభ్యు లే వెన్నెముకలాంటి వారని, సభ్యులు లేనిదే సహకార సంఘాలు లేవని జిల్లా సహకార సంఘం బ్యాంకు సూపరింటెండెంట్ సాధక్అలీ పేర్కొన్నారు. సోమవారం కొత్తపల్లి రైతు సహకార సంఘం 37వ మహాసభ సర్వసభ్య సమావేశం చైర్మన్ త్యార్ల రమేశ్గుప్తా అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడారు. సకాలంలో రుణాలు చెల్లింపులు జరిగినప్పుడే సం ఘాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయన్నారు. సంఘ సభ్యుల సహకారంతోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తపల్లి సహకార సంఘం ఉత్తమ అవార్డును అందుకుందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ కొత్తపల్లి సహకార సంఘం రూ.40 లక్షల లాభాలతో పయనిస్తున్నదన్నారు. సంఘం ఆధ్వర్యంలో క్రయవిక్రయాల ద్వా రా రూ.42 లక్షలు ప్రభుత్వం ద్వారా రావాల్సి ఉందన్నారు. రుణాలు పొందిన ప్రతి సభ్యుడు సరైన సమయంలో రుణాలను రిన్యువల్ చేసుకోవాలన్నారు. అంతకుముందు సహకార సంఘం సీఈవో వెంకటేశ్వర్ సంఘం ద్వారా ఆదాయ, వ్యయాలను చదివి వినిపించారు. క్రాప్ లోన్ ద్వారా ఎకరాకు లక్ష 60వేలకు పెంచుకునేలా, కుర్తివాడ, కొడుపాక గ్రామాల్లో 5000 మెట్రిక్ టన్నుల గిడ్డంగుల నిర్మాణాలు చేపట్టేందుకు తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీసీవో ఫజాజొద్దీన్, పాపన్నపేట ఎంపీపీ చందనాప్రశాంత్రెడ్డి, సర్పంచ్ కుమ్మరిజగన్, చీకోడ్ సహకార సంఘం చైర్మన్ దత్తుగుప్తా, మిన్పూర్ ఎంపీటీసీ కుభేర్, మాజీ సంఘం డైరెక్టర్లు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.