మెదక్ మున్సిపాలిటీ, మార్చి 20 : క్రీడల్లో గెలుపోటములు సహజమని, రెండింటినీ సమానంగా తీసుకోవాలి.. ఓటమి సైతం విజయంతో సమానమేనని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. నిరంతర సాధనతో అపజయాలను సైతం విజయాలుగా సొంతం చేసుకోవచ్చని అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీనియర్ క్రికెటర్స్ ప్రీమియర్ లీగ్-2 పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 10 జట్లు తలపడగా, విన్నర్స్‌గా పాస్నేట్ జట్టు, రన్నర్‌గా చైతన్య జట్టు నిలిచింది. బహుమతుల ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన పద్మాదేవేందర్‌రెడ్డి విజేతలకు ట్రోఫీలు అందజేశారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండోసారి ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు పెద్ద ఎత్తున నిర్వహించడాన్ని కొనియాడారు. క్రీడలు మానసికోల్లాసానికి ఎంతో దోహదపడుతాయన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో శారీరక దృఢత్వం అవసరమన్నారు.
స్పోర్ట్స్ ఫౌండేషన్ కోరిక మేరకు మెదక్‌లో స్పోర్ట్స్ ఫౌండేషన్ భవనంతో పాటు క్రికెట్ మైదానానికి స్థలం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అంతేగాకుండా జూనియర్ కళాశాల మైదానంలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. వారం రోజుల్లో లైటింగ్ సదుపాయం కల్పిస్తానన్నారు. త్వరలోనే కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ వస్తారని, స్పోర్ట్స్ కోసం మరిన్ని నిధులు కావాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నరేందర్, టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు శంకర్‌దయాల్ చారి, కొల్చారం మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాగి అశోక్, మున్సిపల్ కౌన్సిలర్లు జయరాజ్, ఆర్కె శ్రీనివాస్, కిశోర్, లక్ష్మీనారాయణగౌడ్, సమియొద్దీన్, స్పోర్ట్స్ ఫౌండేషన్ గౌరవ అధ్యక్షుడు శివశంకర్‌రావు, అధ్యక్షుడు జుబేర్, ప్రభు, ఎంఎల్ఎన్ రెడ్డి, మహేందర్‌రెడ్డి, కొండా శ్రీనివాస్, నందిని శ్రీనివాస్‌తో పాటు టీఆర్ఎస్ నాయకులు లింగారెడ్డి, సతీశ్, నవీన్, ప్రవీణ్‌గౌడ్ పాల్గొన్నారు.
దేశంలోనే ఆదర్శం కల్యాణ లక్ష్మి
రామాయంపేట రూరల్, మార్చి20: దేశంలోనే కల్యాణలక్ష్మి పథకం ఆదర్శంగా నిలుస్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం రామాయంపేట మండలం దామరచెర్వు గ్రామంలో కల్యాణలక్ష్మి చెక్కులు ఇంటింటికీ తిరుగుతూ అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా కల్యాణలక్ష్మి పథకం అమలవుతుందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 12లక్షల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. రైతులకు రైతు బంధు ద్వారా రూ.50 వేల కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ అయ్యాయన్నారు. నిరుద్యోగ సమస్య తీర్చేందుకు 91 వేల ఉద్యోగ నోటిఫికేషన్లు వేయడం హర్షించదగ్గ విషయమన్నారు. ఏదైతే నీళ్లు, నిధు లు, నియామకాలు అనే సంకల్పంతో ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక తెలంగాణ ఆ దిశగా వేగంగా అడుగులు వేయడం సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైందన్నారు. త్వరలోనే రోడ్ల సమస్య కూడా తీరుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నార్సింపేట భిక్షపతి, జడ్పీటీసీ జేరిపోతుల సంధ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, గ్రామ ఉప స ర్పంచ్ దండు రమేశ్, పాకాల చంద్రశేఖర్‌రావు, వార్డు స భ్యులు డానియల్, దండు చంద్రం, కుస్తి నారాయణ, ఆ యా గ్రామాల సర్పంచ్‌లు సుభాశ్, శ్యాములు, మల్లేశం, ఇతర నాయకులు ఇమ్మానియేల్, ఉమామహేశ్వర్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన బాధితులు
దామరచెర్వు గ్రామంలో ఇటీవల మంగళి రాము కుమారుడు ఊర కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబీకులు గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి తమ గోడు వెళ్లబోసుకున్నారు.