చేగుంట, మార్చి 13: టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్శితులై పార్టీలోకి చేరుతున్నట్లు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ మైనార్టీ శాఖ అధ్యక్షుడు మహ్మద్ జహంగీర్ అలీ ఆదివారం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్ ప్రభు త్వం మైనార్టీలకు పెద్దపీట వేస్తుందని జహంగీర్ అలీ అన్నారు.మండల కేంద్రమైన చేగుంటలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు బంధువు, టీఆర్ఎస్ నాయకుడు లక్ష్మీనారాయణ దశదినకర్మలో ఎంపీ పాల్గొని నివాళులర్పించారు. అనంతరం నార్సింగ్‌లోని మాజీ టెలికాం బోర్డు సభ్యులు అంచనూరి రాజేశ్ కూతురు శారీ ఫంక్షన్లో పాల్గొన్నారు. తదనంతరం మార్కెట్ కమిటీ గోదాములను పరిశీలించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాడెం వెంగళరావు, జడ్పీటీసీ ము దాం శ్రీనివాస్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు జీవన్‌రెడ్డి, బక్కి రమేశ్, సోమ సత్యనారాయణ, నార్సింగి మండల అధ్యక్షుడు మైలా రం బాబు, ఎంపీపీ చిందం సబిత, జడ్పీటీసీ కృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.