తూప్రాన్/రామాయంపేట, మార్చి 6: తూప్రాన్, చేగుంట మండలాలలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించేందుకు నేడు ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి రానున్నట్లు ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ బొంది రవీందర్‌గౌడ్ తెలిపారు. తూప్రాన్ మున్సిపల్లో విలేకరులతో వారు మాట్లాడుతూ మధ్యాహ్నం 3గంటలకు రూ.5 కోట్ల వ్యయంతో నిర్మించిన మున్సిపల్ భవనం, రూ.30 లక్షలతో నర్సాపూర్ చౌరస్తాలో నిర్మించిన ఐలాండ్, రూ.3.5 కోట్లతో నిర్మించిన వైకుంఠధామం, రూ.10 కోట్లతో నిర్మించిన ఏఎంసీ మార్కెట్ యార్డ్, రూ.5 కోట్లతో నర్సాపూర్ చౌరస్తా నుంచి అయ్యప్ప గుడ్డి వరకు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, టోల్ గేట్ సమీపంలో నిర్మించిన అతిథి గృహాలను ప్రారంభిస్తారన్నారు. దీంతోపాటు టాటా కాఫీ పక్కన రూ.1.7 కోట్ల వ్యయంతో నిర్మించనున్న డంపింగ్ యార్డ్‌కు మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. చేగుంట మండలంలోని మార్కెట్ కమిటీ షాపింగ్ కాంప్లెక్స్ షట్టర్లు, ఆదర్శ పాఠశాల బాలికల వసతి గృహ భవనాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ నేతలు, అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరై విజయవంతం చేయాలని చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.170 నుంచి 200 కోట్లతో తూప్రాన్‌ను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో తూప్రాన్ మున్సిపల్ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, పార్టీ మండల అధ్యక్షుడు బాబుల్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సతీశ్‌చారి, నాయకులు బస్వన్నగారి సత్యనారాయణ గౌడ్, గుమ్మడి శ్రీనివాస్, సత్తార్, అంజయ్య యాదవ్, చెలిమెల రఘుపతి, సత్యలింగం, వెంకట్ గౌడ్, మామిండ్ల కృష్ణ, ఆంజనేయులు, రఫీక్, గడ్డం రవి తదితరులు పాల్గొన్నారు.