జహీరాబాద్, మార్చి 4 : దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకం అమలు చేసి లబ్ధిదారులకు రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా గోటిగార్పల్లి గ్రామాన్ని ఎంపిక చేశారు.
గోటిగార్పల్లి గ్రామ లబ్ధిదారులకు దళితబంధు పథకంపై పూర్తి అవగాహన కల్పించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేశారు. రూ.10లక్షల ఆర్థికసాయం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నారు. కలెక్టర్ ఆదేశాలతో అదన పు కలెక్టర్ రాజర్షిషా గ్రామంలో వివిధ శాఖల అధికారులతో దళి తబంధు పథకంపై సదస్సు నిర్వహించి లబ్ధిదారులకు అవగాహన కల్పించారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు సూచనతో పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకుని గ్రామంలో 100 మంది లబ్ధిదారులను గుర్తించారు. ఎంపిక చేసినవారు ఎలాంటి యూనిట్లు ఏర్పాట్లు చేయాలనుకుంటున్నారో? వివరాలను సేకరించారు.
పాడిపరిశ్రమ, పౌల్ట్రీఫాం, గూడ్స్ వాహనాలు, ట్రాక్టర్లు, కిరాణా దుకాణాలు, క్లాత్ ఎంపోరియంతోపాటు పలు వ్యాపారాలు చేసుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తి కనబర్చారు. లబ్ధిదారులతో కొత్త గా బ్యాంకు ఖాతాలను తెరిపించారు. దళారుల ప్రమేయం లేకుం డా నేరుగా ఖాతాల్లో రూ.10 లక్షల సాయం జమ కానున్నది. ప్రభుత్వం దళితుల అభ్యున్నతికి రూ.10 లక్షల ఆర్థికసాయం చేసి యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. వీరికి రెండు, మూడు రోజు ల్లో ఆర్థికసాయం అందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నా రు. దళితబంధు పథకం అమలుపై దళిత వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతున్నది. మంత్రి హరీశ్‌రావుతో లబ్ధిదారులకు యూని ట్లు మంజూరు చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. గోటిగార్పల్లిలో మేకలు పెంపకానికి ఐదుగురు, 34 మంది పాడిపరిశ్రమ ఏర్పాటుకు ముందుకొచ్చారు. స్థానిక వనరులతో యూని ట్లు ఏర్పాటు చేసుకునేందుకు లబ్ధిదారులు ముందుకొస్తున్నారు. లబ్ధిదారులకున్న ఆసక్తిపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.
పేదల కోసం ‘దళితబంధు’
దళితబంధు పథకంలో గోటిగార్పల్లి గ్రామాన్ని ప్ర భుత్వం ఎంపిక చేసింది. గ్రామంలో పేదరికంలో ఉ న్న 100 మందిని ఎంపిక చేశాం. యూనిట్లు ఎంపికపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాం. లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపి క చేశాం. వారు కోరుకున్న యూనిట్లు మంజూ రు చేస్తున్నాం. యూనిట్ల ఎంపికలో ఎవరి ఒత్తిడి లేదు. వారం రోజల్లో లబ్ధిదారులకు యూనిట్లు మంజూరు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
– మహేశ్, ఎంపీడీవో మొగుడంపల్లి
మా గ్రామంలో వంద మంది
ఆర్థికంగా, సామాజికం గా వెనుకబడిన దళితుల ను అన్ని రంగాల్లో అభివృ ద్ధి చేసేందుకు సీఎం కేసీ ఆర్ దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారు. గోటిగార్ పల్లి గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయ డం సంతోషంగా ఉన్నది. ఒక గ్రామంలో వంద మంది లబ్ధిదారులను ఎంపిక చేయడం మా అదృష్టం. ప్రతి ఇంటిలో ఒకరికి రూ.10 లక్షలు మంజూరు అందేలా ఎంపిక చేశారు. ఎస్సీ స ర్పంచ్‌గా నా హయాంలో ఈ పథకం రావడం ఎప్పుడూ మరిచిపోను. సీఎం కేసీఆర్ సార్‌కు దళితులు రుణపడి ఉంటారు.
– పెంటప్ప, సర్పంచ్ (గోటిగార్పల్లి)
మా దేవుడు.. సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ మా దేవుడు.. కూలి పని చే సుకుంటూ జీవించే మా కు రూ.10 లక్షలు ఇచ్చి వ్యాపారం చేసుకొమ్మనడం సంతోషంగా ఉం ది. మాకు దళితబంధులో బర్రెలు మంజూ రు చేస్తారని ఎప్పడూ అనుకోలేదు. అధికారులు మా ఊరికి వచ్చి ప్రభు త్వం మీకు రూ.10లక్షలు ఇస్తున్నది.. మీకే మీ కావాలని అడిగితే బర్రెలు కొంటామని, పా లు అమ్ముకుని జీవిస్తామని చెప్పాం. సీఎం కేసీఆర్ సారుకు జీవితాంతం రుణపడి ఉంటాం.
– దండు కమలమ్మ,లబ్ధిదారురాలు (గోటిగార్పల్లి)
గూడ్స్ వాహనానికి దరఖాస్తు చేసుకున్నా..
నేను డ్రైవరుగా పని చేస్తున్నా.. ద ళితబంధు పథకం లో గూడ్స్ వాహ నం కోసం దరఖా స్తు చేసుకున్నా. కూరగాయలు, ఇతర వస్తువులు ర వాణా చేసేందుకు వాహనం మం జూరు చేయాలని కోరినా.. అధికా రులు బ్యాంకులో కొత్త ఖాతా తీసు కున్నరు. మాకు రూ.10లక్షలు స ర్కార్ మంజూరు చేస్తదని ఎప్పు డూ అనుకోలేదు.
– సురేశ్, లబ్ధిదారుడు
సెంట్రింగ్ డబ్బాలు కొంటా..
సెంట్రింగ్ డబ్బాల ను కొనడానికి దరఖా స్తు చేసుకున్నా. సర్కా ర్ రూ.10 లక్షలు మం జూరు చేస్తుందని ఎ ప్పడూ ఆలోచన చేయ లేదు. దళితబంధు ప థకంలో నన్ను ఎంపిక చేసి డబ్బులు మం జూరు చేస్తామని అధికారులు చెప్పడం సం తోషంగా ఉంది. సీఎం కేసీఆర్ మా ఊరిలో ని దళితులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందు కు ఈ పథకాన్ని తీసుకొచ్చిండు. చాలా సం తోషంగా ఉంది. దళితులంతా సీఎం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటాం..
– అంజన్న, లబ్ధిదారుడు