చేగుంట, మార్చి2: తెలంగాణ ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాలు మంచి ఫతితాలిస్తున్నాయి. మండలంలోని రుక్మాపూర్‌లో ఏర్పాటు చేసి న పల్లె ప్రకృతి వనంలో వివిధ రకాల మొక్కలను హరితహారంలో భాగంగా నాటారు. ఈ మొక్కలకు పంచాయతీ ట్రాక్టర్‌తో నీటిని అందిస్తూ సంరక్షిస్తున్నారు. నర్సరీలో పెరిగిన పిచ్చి మొక్కలను నిర్వాహకులు ఎప్పటికప్పుడు తొలిగిస్తున్నారు. గ్రామంలో సేకరించిన తడి, పొడి చెత్తతో తయారు చేసిన ఎరువులను మొక్కలకు వేస్తున్నారు.
పండ్లు, పూల మొక్కల పెంపకం
మండలంలోని రాంపూర్ నర్సరీ నుంచి గతేడాది క్రితం తెచ్చిన 90 బొప్పాయి మొక్కలను ఈ వనంలో పెంచుతున్నారు. వీటితో పాటు జామ, దానిమ్మ, ఆడవిమల్లి, కొబ్బరి, ముద్దగన్నేరు, ఖర్జూర, సిపాద, వేప, ఉసిరి, అల్లనేరుడు, బొప్పాయి, సన్న కొబ్బరి, మామిడి, గుబు రు చెట్లు వంటి పలు రకాల పండ్లు, పూల మొక్కలు పెంచుతున్నారు. మేకలు, పశుశులు, ఆటవీ జంతువులు ప్రకృతి వనంలోకి ప్రవేశకుండా చుట్టూ కంచె ఏర్పాటు చేసి, వాటిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఒకో బొప్పాయి చెట్టుకు 20 నుంచి 50 వరకు కాయలు కాస్తున్నాయి. ప్రకృతి వనంలో నాటిన జామచెట్లు కూడా పూత దశ నుంచి కాత దశకు వచ్చే అవకాశం ఉంది. అనారోగ్యం బారిన పడిన వారు ఈ ప్రకృతి వనంలో పండుతున్న బొప్పాయి పండ్లను తీసుకెళ్తున్నారు. మొదటి కాత కావడంతో ప్రస్తుతం వాటిని ఉచితంగా ఇస్తున్నారు. బయట మార్కెట్లో ఒక్క బొప్పాయి రూ.30 నుంచి రూ.50లు ఉంటుంది.
రాంపూర్ నర్సరీ నుంచి తెప్పించాం..
గతేడాది క్రితం తెచ్చిన రాంపూర్ నర్స రీ నుంచి 90 బొప్పాయి మొక్కలు తె ప్పించి పల్లె ప్రకృతి వనంలో నా టాం. ప్రస్తుతం ఒకో చెట్టుకు 20 నుంచి 50 వరకు కాయలు వస్తున్నాయి. అనారోగ్యంతో ఉన్నవారికి ఈ బొప్పాయి పండ్లను ఉచితంగా ఇస్తున్నాం.
– బస్కి అంజిరెడ్డి, టీఆర్ఎస్ నాయకుడు
కంటికి రెప్పాలా కాపాడుకుంటున్నాం
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనంలోని పండ్లు, పూల మొక్కలను రోజూ పంచాయతీ ట్రాక్టర్‌తో నీటిని అందించి సంరక్షిస్తున్నాం. ఈ మొక్కలు బాగా పెరుగుతున్నాయి.
– మ్యాకల కాశీరాం, వార్డు సభ్యుడు, రుక్మాపూర్
ఫాంహౌస్‌ను తలపిస్తున్నది..
గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి వనాలు ఏర్పాటు చేయలేదు. సీఎం కేసీఆర్ ఊరుకో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయడంతో రోజూ ఇక్కడే ఉపాధి దొరుకుతున్నది. ప్రకృతి వనంలో పని చేస్తుంటే ఫాంహౌస్‌లో పని చేస్తున్నట్లున్నది.
– మ్యాకల నర్సింహులు, వనం నిర్వాహకుడు