రాజ్యాంగాన్ని పరిరక్షించాలి
భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భం గా శనివారం జిల్లావ్యాప్తంగా రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతోపాటు ప్రజా సంఘాల నాయకు లు అంబేదర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
- రాజ్యాంగంపై అవగాహన ఉండాలి
- హక్కులతోపాటు విధులు పాటించాలి
- బాలలు, వృద్ధుల హక్కులను కాపాడాలి
- నర్సాపూర్ సివిల్ కోర్టు జడ్జి అనిత
- జిల్లావ్యాప్తంగా 73వ రాజ్యాంగ దినోత్సవం
- జడ్పీ కార్యాలయంలో చైర్పర్సన్ ప్రతిజ్ఞ
మెదక్ జిల్లా నెట్వర్క్, నవంబర్ 26:భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భం గా శనివారం జిల్లావ్యాప్తంగా రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతోపాటు ప్రజా సంఘాల నాయకు లు అంబేదర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. భారత దేశాన్ని సార్వభౌమ, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నెలకొల్పడానికి పునరంకితమవుతామని ప్రతిజ్ఞ చేశారు. రాజ్యాంగం కల్పించిన హకు లు, బాధ్యతలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని జడ్పీ చైర్పర్సన్ హేమలతా గౌడ్ పేర్కొన్నారు. దేశంలో ఉన్న వి భిన్న జాతులు, మతాలు, జీవన విధానం, జీవనశైలిని దృష్టి లో పెట్టుకొని సమన్యాయం చేయాలని ఉద్దేశంతో రాజ్యాంగాన్ని రచించారన్నారు. రాజ్యాంగం ద్వారా ప్రతి పౌరుడికి సమాన హకులు, బాధ్యతలు కల్పించిందని, ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి లోబడి జీవించాలని సూచించారు.
రాజ్యాం గం దేశానికి రక్షణ కవచంలా పని చేస్తున్నదని అధికారులు వివరించారు. ప్రజలందరూ రాజ్యాంగ పరిరరక్షణకు కృషి చేయాలని మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ పిలుపుని చ్చారు. భావితరాలకు మెరుగైన సమాజం అందించాలని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. టీఎన్జీవో భవన్లో డీసీటీవో జెల్ల సుధాకర్ అధ్యక్షతన రాజ్యాంగ సదస్సు నిర్వహించారు. బానిస భావాలు కలిగిన వ్యక్తి కంటే స్వతంత్ర భావాలు గల బానిస వెయ్యి రేట్లు మేలని అంబేదర్ మాటలను టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ పేరొన్నారుగుర్తు చేశారు.
చిలిపిచెడ్ మండలంలోని చిట్కుల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ ఆదేశాల మేరకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సాపూర్ జూనియర్ సివిల్ జడ్జి కె.అనిత మాట్లాడుతూ.. ప్రతి ఆడపిల్లకు 18 ఏండ్లు నిండిన తర్వాతనే పెండ్లి చేయాలన్నారు. బాలలు, వృద్ధుల హక్కులు, ఆస్తి హక్కు, రాజ్యాంగం హక్కులను కాపాడాలని పేర్కొన్నారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. విద్యార్థులు అంబేద్కర్ లాగా ఉన్నత చదువులు చదువుతూ ఉన్నతమైన స్థాయికి ఎదగాలన్నారు. మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట మున్సిపాలిటీల్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయాల్లో రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని పాలకవర్గంసభ్యులతోపాటు అధికారులు ప్రతిజ్ఞ చేశారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

