రామాయంపేట, నవంబర్ 21: రామాయంపేట మున్సిపల్లోని వార్డుల్లో సమస్యల్లేకుండా తీర్చడమే తన లక్ష్యమని పురపాలిక చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్ అన్నారు. సోమవారం రామాయంపేట పురపాలికలోని 12వ వార్డులో వారం రోజు ల పర్యటనలో భాగంగా వార్డులోని సమస్యలను వార్డు ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వార్డులో ఎలాంటి సమస్యలు న్నా తన దృష్టికి తేవాలని వార్డు ప్రజలను, వార్డు కౌన్సిలర్‌ను కోరారు. ముఖ్యంగా వార్డులో నీటి సమస్య, విద్యుత్ మరే ఇతర సమస్యలు ఉన్నా తనకు చెప్పాలన్నారు. వార్డులో విద్యుత్ సమస్యలు ఉన్నాయని, స్తంభాలకు విద్యుత్ లైట్లు వెలగడం లేదని చైర్మన్ దృష్టికి తెచ్చారు. వార్డు లో బీడీ కార్మికురాలు తనకు పింఛన్ రావడంలేదని తెలిపింది. ఒక్కో వార్డుకు ఒక్కవారం పాటు సమయం తీసుకుంటామని పట్టణంలోని 12వార్డులకు గాను 12 వారా ల పాటు ప్రతి గల్లీ తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్క రిస్తామన్నారు.
ప్రస్తుతం నాలుగు వార్డులు పూ ర్తి చేశామన్నారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి నాయకత్వంలో పట్టణాన్ని అన్ని రంగాల్లో సుందరీకరిస్తామన్నారు. కార్యక్రమంలో కమిషనర్ డి.యాదగిరి, పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం, మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, సిబ్బందితో పాటు కౌన్సిలర్లు దేమె యాదగిరి, అనిల్‌కుమార్, చిలుక గంగాధర్, నాయకులు దేవుని రాజు, చింతల యాదగిరి, సరాఫ్ శ్యాంసుందర్, ఎస్కే హైమద్, బాలుగౌడ్, మేనేజర్ శ్రీనివా స్, ప్రసాద్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.