రామాయంపేట/కొల్చారం, నవంబర్ 15 : నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ వరమని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. కొల్చారం మండల పైతర గ్రామానికి చెందిన ఎట్టాల దుర్గమ్మ అనారోగ్యంతో బాధపడుతూ సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకుంది. మంజూరైన రూ.48 వేల చెక్కును మంగళవారం ఎమ్మెల్యే మదన్ రెడ్డి కుటుంబీకులకు అందజేశారు. ఆయన వెంట మెదక్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పైతర చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ మురళీగౌడ్ ఉన్నారు. నిరుపేదలకు సీఎం సహాయనిధి ఒక వరమని టీఆర్ఎస్వీ నాయకుడు ఇప్ప రవితేజ అన్నారు. రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్ గ్రామానికి చెందిన నాగమణికి మంజూరైన రూ.70 వేలు సీఎంఆర్ఎఫ్ చెక్కును మంగళవారం బాధిత కుటుంబీకుల ఇంటికి వెళ్లి అందజేశారు. టీఆర్ఎస్వీ నాయకులు ఉన్నారు.
ఎల్వోసీ అందజేత
మెదక్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ) : పేదలకు సీఎంఆర్ఎఫ్ వరమని ఇఫో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి అన్నారు. నిజాంపేట మండలం చల్మెడ గ్రామానికి చెందిన దుర్గయ్య ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకోగా, మంజూరైన రూ. లక్ష ఎల్వోసీని మంగళవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇఫో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి బాధిత కుటుంబీకులకు అందజేశారు. డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, నిజాంపేట్ మండలాధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, చల్మెడ ఎంపీటీసీ నంద్యాల బాల్‌రెడ్డి, తిరుమల స్వామి ఆలయ చైర్మన్ ఆకుల మహేశ్, మాజీ ఉప సర్పంచ్ బాజ దుర్గయ్య, నగరం సర్పంచ్ గేమ్స్ సింగ్, మెదక్ పీఏసీఎస్ చైర్మన్ హన్మంతరెడ్డి రెడ్డి, నాయకులు రాగి అశోక్, లింగారెడ్డి, నర్సింహులు ఉన్నారు.