సంగారెడ్డి, నవంబర్ 15: సమాజంలో మహిళలపై వేధింపులు రోజురోజుకూ పెరుగుతున్నాయని, వారి భద్రతకు ఉమెన్ సేఫ్టీవింగ్ ఏర్పాటుతో భద్రత కల్పిస్తున్నామని ఎస్పీ రమణకుమార్ తెలిపారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట్తో పాటు వికారాబాద్ జిల్లాకు చెందిన స్టేషన్ హౌస్ ఆఫీసర్స్, రిసెప్షన్ ఆఫీసర్స్ హాజరయ్యారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎస్పీ రమణ కుమార్ హజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఒక రోజు శిక్షణను ప్రారంభించా రు.
అనంతరం ఉమెన్ సేఫ్టీవింగ్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళల భద్రతకు ఉమెన్ సేప్టీవింగ్ను ఏర్పాటు చేసి భరోసా ఇస్తున్నమన్నారు. మహిళలను వేధింపులకు గురి చేస్తే అలాంటి వారిపై ఉమెన్ సేఫ్టీవింగ్ హెల్ప్‌డెస్క్ 181, లేదా చైల్డ్‌లైన్ నంబర్1098కు సమాచారం అందించాలన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో మహిళలు, బాలికల భద్రతకు పెద్దపీట వేస్తూ ప్రభు త్వం చర్యలు తీసుకున్నదన్నారు. ఈ సేఫ్టీవింగ్‌ను డీజీపీ మహేందర్‌రెడ్డి, అదనపు డీజీపీ స్వాతిలక్రా, డీఐజీ బడుగుల సుమతి నేతృత్వంలో ఏర్పాటు చేసి మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని ఎస్పీ వెల్లడించారు. కార్యక్రమంలో ఉమెన్ సేఫ్టీవింగ్ అదనపు ఎస్పీ రాజా రత్నం, ఇన్స్పెక్టర్ నరేశ్‌బాబు, డీఎస్పీ రవీంద్రారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాలకు చెం దిన స్టేషన్ హౌస్, రిసెప్షన్ అధికారులు పాల్గొన్నారు.