మెదక్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించింది. ఓటరు నమోదుకు ఈ నెలాఖరు వరకు అవకాశమిచ్చింది. మెదక్ జిల్లాలో పురుషుల ఓట్లతో పోలిస్తే మహిళ ఓటర్లే ఎక్కువగా ఉండటం విశేషం. ఈ జబితాను కలెక్టర్ కార్యాలయంతో పాటు మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారి, తహసీల్దార్ కార్యాలయాలు, పోలింగ్ కేంద్రాల్లోని బూత్ లెవల్ అధికారుల వద్ద అందుబాటులో ఉంచారు.
జిల్లాలో 4,06,629 మంది ఓటర్లు..
డ్రాఫ్ట్ నోటిఫికేషన్ నాటికి జిల్లా మొత్తం 4,06,629 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 2,01,358 మంది పురుషులు కాగా, 2,05,271 మంది ఓటర్లు మహిళ లు ఉన్నారు. మెదక్ నియోజకవర్గంలో 274 పోలింగ్ స్టేషన్లలో 2,01,358 మంది ఓటర్లు ఉండగా, 96, 910మంది పురుషులు, 1,04,446 మంది మహిళ లు ఉన్నారు. 73 మంది సర్వీస్ ఓటర్లు ఉండగా, 2 థర్డ్ జెండర్లు ఉన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో 302 పోలింగ్ కేంద్రాలల్లో 2,05,271 మంది ఓటర్లు ఉండగా, 1,01,408 మంది పురుషులు, 1,03,856 మంది మహిళలు ఉన్నారు. 35 మంది సర్వీస్ ఓటర్లు ఉండగా, 7 మంది థర్డ్ జెండర్లు ఉన్నారు. మొత్తంగా 576 పోలింగ్ స్టేషన్లలో 1,98,318 మంది పురుషులు, 2,08,302 మంది మహిళలు ఉన్నారు. మొత్తం 4,06,629 మంది ఓటర్లు ఉన్నారు. 9 మంది థర్డ్ జెండర్లు ఉండగా, 108మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు.
18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
గతంలో ఓటర్ల నమోదుకు జనవరి 1వ తేదీనే ప్రా మాణికంగా తీసుకునేవారు. అయితే ఈ సంవత్సరం 2023 జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1వ తేదీలను సైతం ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈ తేదీల నాటికి 18 ఏళ్లు నిండిన వారందరూ ఓటరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్, ఆఫ్లైన్లోనూ జిల్లా ఎన్నికల అధికారి, ఓటర్ల నమోదు అధికారికి ఓటరు నమోదు కోసం దరఖాస్తులు అందజేయవచ్చు. దరఖాస్తు దారు రెండు ఫొటోలు, వయస్సు ధ్రువీకరణ కో సం పదో తరగతి సర్టిఫికేట్, చదువులేని వారికి ఆధార్ కార్డు, నివాస ధృవీకరణ పత్రం లేదా కరెంటు బిల్లు తప్పనిసరి అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.హరీశ్ సూచించారు.
26, 27వ తేదీల్లో ప్రత్యేక డ్రైవ్..
ఈ ముసాయిదా జాబితాపై డిసెంబర్ 8వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అలాగే కొత్తగా ఓటరు నమోదు కోసం ఈ గడువులోపు దరఖాస్తు చేసుకోవచ్చు. కొత్త ఓటర్ల నమోదు కోసం ఈ నెల 26, 27, డిసెంబర్ 10, 11 తేదీల్లో ప్రతి పోలింగ్ స్టేషన్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 26 వరకు అభ్యంతరాలు, ఓటరు నమోదు ఫారాలను పూర్తి స్థాయిలో పరిశీలించి వచ్చే సంవత్సరం జనవరి 5న తుది జాబితా విడుదల చేయనున్నారు.
వలస వెళ్లిన ఓటర్ల వివరాలు తొలగింపు..
వలస వెళ్లిన ఓటర్ల వివరాలను గుర్తించి ఓటరు జాబితా నుంచి తొలగిస్తారు. గరుడ యాప్‌తో బీఎల్వోలు ఇంటింటికీ తిరగాల్సిన అవసరం లేదు. ఈ యాప్ సహాయంతోనే ఓటర్ల వివరాలను మొబైల్ ఫోన్ ద్వారా ఎంక్వైరీ చేసి కన్ఫర్మ్ చేస్తారు. అదే ఇన్ఫర్మేషన్ డైరెక్ట్‌గా యాప్‌లో అప్లోడ్ చేస్తారు. అదే విధంగా పోలింగ్ సెంటర్లు, వాటి ఫొటోలు, మౌలిక వసతులు అన్నీ యాప్‌లో నమోదు చేస్తారు.
టోల్ ఫ్రీ నంబర్ 1950..
ఓటరు నమోదు, ఎన్నికలకు సంబంధించి 1950 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఫిర్యాదు కూడా చేయవచ్చు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సేవలు అందిస్తారు.
ముసాయిదా ఓటరు జాబితా ప్రదర్శన..
జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటరు జాబితా ప్ర దర్శించామని మెదక్ కలెక్టర్ ఎస్.హరీశ్ తెలిపారు. ఓ టర్లు జాబితాను సరిచూసుకోవాలని సూచించారు. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ముసాయిదా ఓటరు జాబితాను ప్రదర్శించామని పేర్కొన్నారు. ఈ నెల 26, 27న క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ కు ప్రత్యేక డ్రైవ్ ఉంటుందని తెలిపారు. సద రు ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించి మా ర్పులు, చేర్పులు ఉంటే అభ్యంతరాలు తెలియజేయాలని తెలిపారు.
– ఎస్.హరీశ్, మెదక్ కలెక్టర్