మెదక్ మున్సిపాలిటీ, నవంబర్ 13 :విజ్ఞానాన్ని పంచే భండాగారాలు గ్రంథాలయాలు.. ఎందరినో ఉన్నతులుగా తీర్చిదిద్దే సరస్వతీ నిలాయాలు. ఇక్కడ విజ్ఞానాన్ని పెంపొందింపజేసుకుని ఉన్నత శిఖరాలకు చేరిన వారెందరో ఉన్నారు. కంప్యూటర్ యుగంలో కూడా పుస్తక పఠనంపై యువత మొగ్గు చూపుతున్నారు. ఇంటర్నేట్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఏ విషయమైన నెట్లో సెర్చ్ చేస్తే సులువుగా దొరుకుతున్నది. కానీ పుస్తక పఠనంలో ఉన్న తృప్తి కంప్యూటర్ సెర్చింగ్‌లో లేదంటున్నా రు పాఠకులు. సాంకేతిక ఎంత పెరిగినా.. ఎన్ని కంప్యూటర్లు వచ్చి నా గ్రంథాలయ ప్రత్యేకత కాదనలేదనిదని అంటున్నారు.
చిరిగిన చొక్కా అయినా వేసుకో.. కానీ ఓ మంచి పుస్తకం కొనుక్కో.. ఓ మంచి పుస్తకం స్నేహితుడితో సమానం.. పుస్త కం జీవితాన్ని మారుస్త్తున్నది. ఈ మాటలు మన పెద్దలు చెప్పిన మూటలు. పుస్తక పఠనానికి ఉన్నంత ప్రాధాన్యత మరేదేనికి లేదంటారు. అలాంటి పుస్తక పఠనానికి మార్గం సుగమం చేసేవి గ్రంథాలయాలు. వీటిని విజ్ఞాన కేంద్రాలుగా కూడా పిలుస్తుంటారు. ప్రతి సంవత్సరం నవంబర్ 14 నుం చి 20వ తేదీ వరకు వారం రోజుల పాటు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తుంటారు. పలువురు మహానీయుల కృషి ఫలితంగా ప్రతి ఏటా నవంబర్ 14 నుంచి గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. కరోనా వలన రెండేండ్లుగా వారోత్సవాలు నిర్వహించలేదు. కరోనా తగ్గడంతో ఈసారి నుంచి నిర్వహిస్తున్నారు. 1907లో అయ్యంకి వెంకట్రామయ్య అనే వ్యక్తి రాష్ట్ర గ్రంథాలయాన్ని స్థాపించడం జరిగింది. ఆయనను ఆదర్శంగా తీసుకొని దేశ వ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో అనతి కాలంలోనే గ్రంథాలయాలు వెలిశాయి. పెద్ద పెద్ద నగరాలకు, పట్టణాలకే కాకుండా పల్లెలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అన్ని రకాల పుస్తకాలు అందించాలనే లక్ష్యంతోనే 1919లో అఖిల భారత ప్రజా గ్రంథాలయ అసోసియేషన్‌ను స్థాపించడం జరిగింది. కాలక్రమేణా ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్‌గా మారింది. 1968 నవంబర్ 14నుంచి ప్రతిఏటా గ్రంథాలయ వారోత్సాలను నిర్వహిస్తోంది.
జిల్లాలో18 గ్రంథాలయాలు
జిల్లాలో జిల్లా కేంద్ర గ్రంథాలయంతో కలుపుకుని 18 శాఖ గ్రంథాలయాలు ఉన్నాయి. నూతనంగా ఏర్పాటైన మం డలాలు నిజాంపేట, నార్సింగి, చిలిపిచేడ్, మనోహారబాద్, హవేళి ఘనపూర్, మసాయిపేటలలో నూతన గ్రంథాలయా లు ఏర్పాటు చేసే అవశ్యకత ఉంది. జిల్లా గ్రంథాలయంతో పాటు శాఖ గ్రంథాలయాల్లో లక్ష 50వేలకు పైగా పుస్తకాలు ఉన్నాయి. జిల్లా కొత్తగా ఏర్పాటు కావడంతో గ్రంథాలయ సంస్థలో ఎలాంటి నిధులు లేవు. జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీ నుంచి రావల్సిన 8శాతం గ్రంథాలయ పన్నులు సైతం బకాయిలు ఉన్నట్లు సమాచారం. జిల్లా కేంద్రంలో రూ. 2.50కోట్లతో నిర్మించే జిల్లా గ్రంథాలయ భవనానికి ఇటీవలే మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు.
వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం..
నేటి నుంచి ప్రారంభమ య్యే వారోత్సవాలను పాలకవర్గం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామని గ్రంథాలయ చైర్మన్ దొంతి చంద్రగౌడ్ పేర్కొన్నారు. ముఖ్య అతిథులుగా ఎమ్మె ల్యే స్పీకర్ పద్మాదేవేందరెడ్డి, విశిష్ట అతిథులుగా కలెక్టర్ హరీశ్, గౌరవ అతిథులుగా మెదక్ మున్సిపల్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, ఏఎంసీ చైర్మన్ బట్టి జగపతి, వార్డు కౌన్సిలర్ కృష్ణారెడ్డి ఆహ్వానించాం.
– దొంతి చంద్రాగౌడ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్
వారోత్సవాల సందర్భంగా పోటీలు
14వ తేది వారోత్సవాలు ప్రారంభం. దేశభక్తి గేయాల పోటీ (6, 7వ తరగతి విద్యార్థులకు) 15వ తేదీ ‘పుస్తక ప్రదర్శన’ ఉదయం 11 గంటలకు
16వ తేదీ ‘వ్యాసరచన’ కొవిడ్-విద్యా వ్యవస్థపై ప్రభావం అనే అంశంపై ఉదయం 10గంటలకు
6,7 తరగతులు విద్యార్థులకు.. 11 గంటలకు 8,9,10 విద్యార్థులకు.
17వ తేదీ ఆన్లైన్ తరగతులపై జరుగు లాభాలు, నష్టా లు అనే అంశంపై కాంపీటిషన్
పోటీ ఉదయం 11గంటలకు 8,9,10వ తరగతి విద్యార్థులకు.
18వ తేదీ ‘జ్ఞాపక శక్తి’ 6,7వ తరగతి విద్యార్థులకు ఉదయం 11 గంటలకు.
19వ తేదీ ‘రంగోళి పోటీలు’ ఉదయం 11 గంటలకు 8,9,10వ తరగతి విద్యార్థినులకు,
12గంటలకు చిత్రలేఖనం పోటీలు విద్యార్థినులకు మాత్రమే.
20వ తేదీ ముగింపు వేడుకలు, బహుమతులు ప్రధానోత్సవం.