సంగారెడ్డి, నవంబర్ 11 : సమాజంలో కుల, మతాలతో రాజకీయాలు శాసిస్తున్నారని, కురుమలు ఐక్యతగా ఉంటేనే రాజ్యాధికారం సాధ్యమవుతుందని కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం అన్నారు. శుక్రవారం సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి ప్రధాన రహదారి పక్కన దొడ్డి కొమురయ్య కాంస్య విగ్రహా ఏర్పాటుకు జిల్లా కురుమ సంఘం ఆధ్వర్యంలో భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతాప్రభాకర్ హాజరయ్యారు. అనంతరం బైపాస్ రోడ్డులోని 4వ తరగతి ఉద్యోగుల సంఘం భవనంలో కురుమ సంఘం జిల్లా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఎగ్గే మల్లేశం మాట్లాడుతూ ప్రతి కులంలో రాజకీయంగా ఎదగాలంటే ముందుగా కలాన్ని బలం చేయాలన్నారు. అ తర్వాత కులబలంతో రాజకీయా అవకాశాలు వస్తాయని, వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని రాజకీయాల్లో కీలకంగా మారాలన్నారు. ప్రస్తుత సమాజంలో చదువు ఉన్నవారికే ప్రాధాన్యత వస్తుందని సూచించారు. అందుకోసం కురుమల్లో యువకులు చదువుపై దృష్టి సారిస్తే భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న రాజకీయ చైతన్యానికి దూరంగా ఉన్నారని ఎగ్గే మల్లేశం అందోళన వ్యక్తంచేశారు. కుల సంఘాల భవనాలకు రూ.50లక్షల నిధులు మంజూరు చేస్తానని వెల్లడించారు.
సమాజంలో కులబలంతో నాయకుడుగా ఎదిగే అవకాశం వస్తుందని, అప్పుడే రాజకీయా పార్టీలు గుర్తుంచి అవకాశాలు ఇస్తాయన్నారు. జిల్లా కురుమ సంఘం భవన నిర్మాణానికి ఎగ్గే మల్లేశం తన నిధుల నుంచి రూ. 50లక్షలు మంజూరు చేయడం సంతోషకరమన్నారు. జిల్లాలో దొడ్డి కొమురయ్య విగ్రహం ఏర్పాటుకు అడుగులు వేసి కురుమల్లో చైతన్యం తీసుకురావడం అభినందనీయమన్నారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ పుష్ప, జడ్పీటీసీ మీనాక్షి, కౌన్సిలర్ ఉమా మహేశ్వరీ, అందోల్-జోగిపేట మున్సిపల్ చైర్మన్ మల్లన్న, డైరెక్టర్ భూమన్న, నాయకులు మల్లేశం, నగేశ్ యాదవ్, డాక్టరు శ్రీహరి, బీరయ్య యాదవ్, సాయి కుమార్, డాలర్ కిష్టయ్య, మాజీ సర్పంచ్ వెంకన్న, గోకుల్ కృష్ణ, కురుమ సంఘం నాయకులు ఉన్నారు.
– హ్యండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చింతా ప్రభాకర్