శివ్వంపేట/ చేగుంట/ మనోహరాబాద్, నవంబర్ 9 : శివ్వంపేట మండలం పెద్దగొట్టిముక్ల గ్రామపంచాయతీకి చెం దిన సింగిరెడ్డి మల్లారెడ్డికి మంజూరైన రూ. 30,500 చెక్కును బుధవారం సర్పంచ్ చంద్రకళాశ్రీశైలం యాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన వైద్య చికిత్స కోసం సీఎంఆర్ఎఫ్ నిధులను అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నర్సింహులు, మాజీ ఎంపీటీసీ మహేశ్‌గౌడ్, వార్డు సభ్యులు సుమతీకృష్ణారెడ్డి, ప్రభాకర్‌గౌడ్, సుజాత, నాగరాజుయాదవ్, నర్సారెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
చేగుంట మండలంలోని మక్కరాజిపేట గ్రామానికి చెందిన ఎర్రగొల్ల మౌనిక, బోయిని బాలమణికి మెదక్ ఎంపీ కొత్త ప్ర భాకర్‌రెడ్డి సహకారంతో సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూర య్యాయి. మౌనికకు రూ18వేలు, బాలమణికి రూ.16వేల విలువైన చెక్కులను సర్పంచ్ కుమ్మరి శ్రీనివాస్ అందజేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు జింక శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ నీరుడి బాల్‌నర్సింహులు, నాయకులు బండి విశ్వేశ్వర్, చెనబోయిన స్వామి, మల్లారెడ్డి, సురేశ్‌రెడ్డి, పెంటయ్య, రవీందర్‌రెడ్డి, సత్తిరెడ్డి పాల్గొన్నారు.
మనోహరాబాద్ మండలం రంగాయిపల్లి గ్రామానికి చెం దిన ఆర్.లక్ష్మికి రూ.24వేలు, కుమ్మరి పోచమ్మకు రూ. 21వేల సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయి. ఈ మేరకు లబ్ధి దారులకు చెక్కులు పీఏసీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి అందజేశారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, టీఆర్ఎస్ నాయకుల రమేశ్, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.