చౌటకూర్, నవంబర్6: రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, సంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి రైతులకు సూచించారు. ఆదివారం మండలంలోని చక్రియాల్, గంగోజీపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దన్నారు. ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నదన్నారు. రైతు బీమా, రైతుబంధు, ఉచిత కరెంట్ తదితర పథకాలు అందిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చక్రియాల్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త పోలీస్ చెన్నారెడ్డి ఇంటికి ఎమ్మెల్యే క్రాంతికిరణ్ వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కార్యకర్తలెవరూ అధైర్య పడొద్దని, పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.
సీసీ రోడ్డు పనులు ప్రారంభం
గంగోజిపేటలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.5 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీపీ చైతన్య విజయ్ భాస్కర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ గాజుల వీరేందర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చౌకంపల్లి శివకుమార్, ప్రధాన కార్యదర్శి నాగులపల్లి శ్రీహరి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు బక్కారెడ్డి గారి కిష్టారెడ్డి, మండల కో ఆప్షన్ మెంబర్ ఎండీ అలీం, సర్పంచులు శ్రీనివాస్‌రెడ్డి, నర్సింహరెడ్డి, నేత మాణయ్య, నాయకులు దర్శన్‌రెడ్డి, దేవుని గోపాల్, డాక్టర్ గోపాల్, ప్రసాద్, రాంచందర్, రాములు, ప్రభాకర్‌రెడ్డి, అనంతయ్య, ఆత్మకమిటీ డైరెక్టర్ ఆర్.మల్లేశం, రైతులు పాల్గొన్నారు.