– నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి
టీఆర్ఎస్ ప్రభుత్వం కులవృత్తులకు పూర్వవైభవం తెచ్చిందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. శనివారం వెల్దుర్తిలోని దేవతల చెరువు, కుడి చెరువులో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులతో కలిసి చేప పిల్లలను వదిలారు. గంగపుత్రులు, ముదిరాజ్‌లు ఆర్థికంగా ఎదిగేందుకు ఉచితంగా చేపపిల్లలను ప్రభుత్వం అందజేస్తున్నదని, వ్యాపారాలు నిర్వహించుకునేందుకు రాయితీపై వాహనాలు ఇస్తున్నదని తెలిపారు.
వెల్దుర్తి, నవంబర్ 5: కులవృత్తుల వారికి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని తెలంగాణ సర్కార్ పూర్వవైభవం తెచ్చిందని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులతో కలిసి దేవతల చెరువు, కుడి చెరువుల్లో చేప పిల్లలు వదిలారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత గత పాలకులు కులవృత్తులను నిర్లక్ష్యం చేయడంతో గ్రామాలను వదిలి వారు కూలీలుగా మారారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కులవృత్తుల వారికి పూర్వ వైభవం తీసుకొచ్చారన్నారు. వారి స్వయం కులవృత్తులు చేసుకునేలా ప్రోత్సహిస్తూ వారికి వందశాతం రాయితీలు అందించి ఆదుకుంటున్నారన్నారు. అందుకోసం కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ ఉచితంగా చేప పిల్లలను చెరువుల్లో వదలడంతో గంగపుత్రులు, ముదిరాజ్‌లకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారన్నారు.