మెదక్ రూరల్, అక్టోబర్ 29 : ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తున్నదని, సీఎం కేసీఆర్ రైతుపక్షపాతి అని మెదక్ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, మెదక్ పీఏసీఎస్ చైర్మన్ చిలుముల హనుమంత్‌రెడ్డి పేర్కొన్నారు. మెదక్మండలంలోని రాజ్‌పల్లి, తిమ్మకపల్లి, ఖాజీపల్లి గ్రామాల్లో శనివారం పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్లు జగపతి, హనుమంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతులు ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోవద్దన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని సూచిం చారు. ప్రభుత్వ కేంద్రాల్లోనే మద్దతు ధర లభిస్తుందన్నారు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తు న్నదని, ఇందులో భాగంగా గ్రామాల్లో రైతుల అందుబాటు లో ఉండేలా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదన్నారు.
ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.2060, సాధారణ రకా నికి రూ. 2040 మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. ఎఫ్‌సీఐ ప్రమాణాలకనుగుణంగా ధాన్యంలో 17 శాతం తేమ మించకుండా కేంద్రాలకు తీసుకురావాలని సూ చించారు. గోదావరి జలాలు రావడంతో భూగర్భ జలాలు పు ష్కలంగా పెరిగాయన్నారు. రైతుకు బీమా, పెట్టుబడి, ఎరువులు, విత్తనాలతోపాటు ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తు న్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. పండే ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మార్గం ఆంజనేయులు, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు కిష్టయ్య, మండల వ్యవసాయాధి కారి శ్రీనివాస్, నాయకులు ఎలక్షన్‌రెడ్డి, శ్రీనివాస్, నాగరాజు, కృష్ణ, సీఈవో సాయికుమార్ పాల్గొన్నారు.
దళారులను నమ్మి మోసపోవద్దు..
చిన్నశంకరంపేట, అక్టోబర్ 29 : రైతులు ఆరుగాలం కష్టిం చి పండించిన పంటను దళారులకు విక్రయించి మోసపోవద్దని పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణ సూచించారు. చందంపేట, రుద్రారం, సూరారం, భాగీర్థిపల్లి, దర్పల్లి గ్రామాల్లో చందంపేట సొసైటీ ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేం ద్రాలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ లు అనురాధ, శివకుమార్, రానమ్మ, సర్పంచ్‌లు లక్ష్మణ్, శ్రీలత, సిద్ధ్దిరాంరెడ్డి, దయానంద్‌యాదవ్, నీరజ, సీఈవో పాషా, నాయకులు పోచాగౌడ్, నాగరాజ్ పాల్గొన్నారు.