చిలిపిచెడ్, అక్టోబర్ 21: దేశాన్ని, రాష్ర్టాన్ని అభివృద్ధి దిశగా మార్చడంలో విద్యార్థులే కీలకమని కారియర్ టెక్నాలజీస్ ఇం డియా లిమిటెడ్ మేనేజింగ్ డైర్టెకర్ ప్రకాశ్ బొడ్ల అన్నారు. చిలిపిచెడ్ మండలం ఫైజాబాద్ గ్రామంలోని ఉన్నత పాఠశాలను కారియర్ సంస్థ ఆర్థికసాయంతో నిర్మాణ్ సంస్థ ప్రతినిధులు రూ.కోటి వ్యయంతో వివిధ సౌకర్యాలు కల్పించారు. నూతనం గా నిర్మించిన పాఠశాలను శుక్రవారం ప్రారంభించారు. ఈ సం దర్భంగా కారియర్ టెక్నాలజీస్ కంపెనీ ఎండీ ప్రకాశ్, నిర్మా ణ్ సంస్థ సీఈవో మయూర్ పట్నా మాట్లాడుతూ.. విద్యార్థులే దేశ భవిష్యత్ అన్నారు. విద్యార్థులు చదువు,ఆటలతోపాటు కళా రంగాల్లో రాణించాలని సూచించారు.
అత్యుత్తమ ప్రతిభ ఉన్నవారు, దేశాన్ని పాలిస్తున్న నాయకులు ప్రభుత్వ పాఠశాలల నుంచే వస్తారన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నతంగా చదివి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆశయాలను తీర్చాలన్నారు. అ బ్దుల్ కలాం ఆశయాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలోని 3వేల ఉన్నత, 9 వేల ప్రాథమిక పాఠశాలను సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యాంగా ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థు లు చెడు వ్యసనాలు, చెడు స్నేహాలకు దూరంగా ఉంటూ ఉన్న త స్థానాలకు చేరుకోవాలని సూచించారు. ఫైజాబాద్ పాఠశాల రూపు రేఖలు మారడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొన్నది. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రద ర్శించారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం విఠల్, ఫైజాబాద్ పాఠశాల హెచ్ఎం తారాసింగ్, మాజీ హెచ్ఎంలు రాధారాణి, సావిత్రి, కారియర్ ప్రతినిధి అనూరాధ, సర్పంచ్ మనోహర, ఎంపీటీసీ మల్లమ్మ, కార్యదర్శి నాగరాజు, పాఠశాల చైర్మన్ సురేఖ, నాయకులు నర్సింహరెడ్డి, సంగాగౌడ్ పాల్గొన్నారు.