మెదక్ అర్బన్/ పాపన్నపేట/ టేక్మాల్/ నర్సాపూర్/ చిలిపిచెడ్/ కొల్చారం/ వెల్దుర్తి/ రామాయంపేట/ మనోహరాబాద్, అక్టోబర్ 21 : జిల్లావ్యాప్తంగా శుక్రవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. పోలీ సు అధికారులు అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఐలు, ఎస్సైలు మాట్లాడారు. ప్రజల రక్షణ కోసం ప్రాణాలను ఆర్పించడానికి ముందుండేవారు పోలీసు లు అని పేర్కొన్నారు. పోలీసు అమరుల త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రజా రక్షణకు కృషి చేస్తామన్నారు.
మెదక్ పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ ఆధ్వర్యంలో రక్తదాన శిబి రం నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ డీఎస్పీ సైదులు మాట్లాడుతూ… రక్తదానం ప్రాణదానంతో సమానమన్నారు. ప్రజల రక్షణే పోలీసుల లక్ష్యం అని పేర్కొన్నారు. ఈ రక్తదాన శిభిరంలో 60 యూనిట్ల రక్తమును సేకరించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో మెదక్ పట్టణ సీఐ మధు, మెదక్ రూరల్ సీఐ విజయ్‌కుమార్, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
అమరవీరుల పోలీసులకు నివాళులు
పాపన్నపేట పోలీస్‌స్టేషన్‌లోని అమరవీరుల స్తూపం వద్ద ఎస్సై విజయ్‌కుమార్ నివాళులర్పించారు. విధి నిర్వహణలో అమరులైన హెడ్‌కానిస్టేబుల్ రఘునందన్, కానిస్టేబుళ్లు ప్ర సాద్, రాంచందర్, నర్సింహులు, అబీద్ హుస్సేన్ చిత్రపటాలకు నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎస్సైలు విజయ్ కుమార్, గాలయ్య, హెడ్‌కానిస్టేబుల్ పాల్గొన్నారు.
టేక్మాల్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ లింగం, పోలీసు సిబ్బందిని ధనూర పాఠశాల విద్యార్థులు, హెచ్ఎం సంజీవయ్య, ఉపాధ్యాయు లు వరప్రసాద్, కిరణ్ సన్మానించారు.
నర్సాపూర్‌లో విద్యార్థులతో కలిసి పోలీసులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో ఎస్సైలు గంగరాజు శ్రీనివాస్, కానిస్టేబు ళ్లు రాము, పాండు, భిక్షపతి, యాదయ్య, శ్రీశైలం, సంతోశ్, కవిత, బిందు ఉన్నారు. చిలిపిచెడ్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో పోలీసు అమరవీరులకు ఎస్సై మహ్మద్‌గౌస్ నివాళులర్పిం చారు. కొల్చారంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ లో ఏఎస్సైలు వాణి, తారాసింగ్, పొలీసు సిబ్బంది మహేశ్, దత్తు, దయానంద్, సాయిబాబా, ఆంజనేయులు, సౌందర్య, యాదమ్మ పాల్గొన్నారు. వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్సై వసురాం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పోలీస్ విధులపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హెచ్‌కానిస్టేబుల్ రామచంద్రారెడ్డి, సిబ్బంది అఖిల్, సిద్ధ్దిరాములు, కృష్ణ, పీడీ ప్రతాప్‌సింగ్, ఉపాధ్యాయుడు అక్బర్ పాల్గొన్నారు.
పోలీసులకు ఉచిత వైద్యశిబిరం
రామాయంపేట పోలీస్‌స్టేషన్‌లో సంజీవని దవాఖాన వైద్యులు వైద్యశిబిరాన్ని నిర్వహించారు. సీఐ చంద్రశేఖర్‌రెడ్డి తోపాటు సుమారు. 60 మంది పోలీసులు పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో రామాయంపేట, చేగుంట, చిన్నశంకరంపేట, చేగుంట, నిజాంపేట, నార్సింగి ఎస్సైలు ప్రకాశ్ గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, రాజేశ్, సుభాష్‌గౌడ్, వైద్యులు మధునాల, రామస్వామిగౌడ్ పాల్గొన్నారు. మనోహరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై రాజుగౌడ్ ఓపెన్‌హౌస్ నిర్వహించారు.
నేడు చేగుంటకు ఏస్పీ రోహిణిప్రియదర్శిని రాక….
చేగుంటలో పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న రక్తదాన శిబిరాన్ని శనివారం ఏస్పీ రోహిణి ప్రియదర్శిని ప్రారంభించనున్నట్లు ఎస్సై ప్రకాశ్‌గౌడ్ తెలిపారు. పోలీసుల ఆమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని శనివారం ఉదయం10గంటలకు చేగుంట పోలీస్‌స్టేషన్ ఆవరణలో రక్తదాన శిబిరం, సీసీ కెమెరాలను ఎస్పీ ప్రారంభిస్తారని వివరించారు.