నర్సాపూర్/ రామాయంపేట/నిజాంపేట, అక్టోబర్ 19 : పోలీస్ అమరవీరుల దినోత్సవం అక్టోబర్ 21 పురస్కరించుకొని బుధవారం నర్సాపూర్ పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా సీఐ షేక్‌లాల్ మదార్ విద్యార్థులకు పోలీస్ విధులు, 100 నంబర్ ప్రాధాన్యత వివరించారు. ప్రజా రక్షణే పోలీసు ప్రధాన లక్ష్యమని విద్యార్థులతో పేర్కొన్నారు. కార్యక్రమం లో ఎస్సై గంగరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
రామాయంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థ్ధులకు ఓపెన్ హౌజ్ నిర్వహించారు. పోలీస్‌స్టేషన్‌ను విద్యా ర్థులు సందర్శించి, అన్ని విభాగాల్లో పోలీసుల పనితీరు, కేసుల రికార్డులు, ఒపెన్ హౌజ్, ఆయుధ కర్మాగారాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్సై రాజేశ్ మాట్లాడుతూ.. పోలీసులు ప్రజల రక్షణ కోసమే పని చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు ఈ నెల 20లోగా స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఎస్సైలకు దర ఖాస్తులను అందజేయాలని సూచించారు. పోలీస్ సంస్మరణ సభకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో కానిస్టేబుళ్లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
నిజాంపేట పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఉదయం 9 గంటలకు రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు స్థానిక ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, యువకులు రక్తదానం చేయాలని కోరారు.
మెదక్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : ‘పోలీస్ ఫ్లాగ్ డే’ పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాలను స్మరిస్తూ ఆక్టోబర్ 31 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మెదక్ పట్టణ సీఐ మధు తెలిపారు. పోలీస్ త్యాగాలు, పో లీసుల ప్రతిభపై షార్ట్ ఫిలిమ్స్ (3 నిమిషాలు), ఫొటోలను రాష్ట్రస్థ్ధాయి పోటీలకు ఈ నెల 20లోగా జిల్లా పోలీస్ ప్ర ధాన కార్యాలయంలో అందజేయాలన్నారు. వివరాలకు 9640474336 కు సంప్రదించగలరని తెలిపారు.