నిజాంపేట/ చిలిపిచెడ్, అక్టోబర్ 19 : వానకాలంలో వానలతోపాటు పంటల కు వివిధ రకాల తెగుళ్లు, చీడ పురుగులు వస్తాయని, పంటలను ఆశించే తెగుళ్ల నివారణకు రైతులు వ్యవసాయాధికారుల సూచనలు పాటించాలని రామాయంపేట ఏడీఏ వసంతసుగుణ సూచించారు. నిజాంపేట మండల పరిధిలోని నస్కల్ గ్రామంలో బుధవారం పత్తి పంటలను ఏడీఏ వసంతసుగుణ సందర్శించి, పరిశీ లించారు. సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పత్తి పంటలో గులాబీరంగు పురుగు, బూడిద తెగులు ఉధృతి అధికంగా ఉందన్నారు. వీటి నివారణకు వ్యవసాయాధికారులు సూచించిన మందులను పిచికారీ చేయాలని వివరించారు. ఏడీఏ వెంట ఏఈవో గణేశ్, రైతులు స్వామి, రామయ్య, మాధవరెడ్డి ఉన్నారు.
చిలిపిచెడ్ మండలం చండూర్ గ్రామంలో మిరప పంటల ను ఏఈవో భూపాల్తో కలిసి ఏవో బాల్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏవో మాట్లాడుతూ.. ఎడతెరిపి లేని వర్షాల తో మిర్చి చెట్టు ఏపుగా పెరగలేదని తక్షణ చర్యగా కాపర్ ఆక్సోక్లోరైడ్, ప్లోంటోమైసిన్ 0.5గ్రా లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలని సూచించారు. మిరప పంటలో పెనుబంక ఉధృత్తి ఉన్నదన్నారు. పెనుబంక నివారణకు ఇమిడాక్లోప్రిడ్ 0.5మీ. మీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. వరిపంటలో గింజ మచ్చతెగులు నివారణకు ప్రాపికానజోత 1మీ.మీ మం దును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలని తెలిపారు. వారివెంట స్థానిక రైతు భేతయ్య ఉన్నారు.
చిన్నశంకరంపేట, అక్టోబర్ 19 : మండలకేంద్రం చిన్నశంకరంపేట శివారులో ఓ రైతు పొలంలో అధికారులు పంట దిగుబడి అంచనా వేశారు. జిల్లా గణాంకాధికారి ఎస్పీ సుధ సమక్షంలో తహసీల్దార్ రాజేశ్వర్రావు ఆధ్వర్యంలో రైతు దుర్గయ్య పొలంలో (196/1 సర్వే నెంబర్) 5.5విస్తీర్ణంలో వరి పంటను కోసి వడ్లను తూకం వేయగా 15.29కిలో దిగు బడి వచ్చింది. పంటకోత ప్రయోగం ద్వారా రైతుకు ఎకరాకు ఎంతపెట్టుబడి వ్యయం జరిగింది? ఎంత దిగుబడి వస్తుంది? అనే వివరాలను సేకరించారు. పంట కోత ప్రయోగ కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా కొనసాగిస్తున్నామని జిల్లా గణాంక అధికారి ఎస్పీ సుధ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు నూతన వంగడాలను సాగు చేస్తూ పంట దిగుబడి పెంచాలన్నారు. సాగులో అధునిక పద్ధతులు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో గణాంక మండల అధికారి సురేశ్, ఆర్ఐ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
– జిల్లా గణాంకాధికారి ఎస్పీ సుధ