సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 19 : ఉద్యోగులు అంకితభావంతో పనిచేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా విభాగాల్లో సిబ్బంది హాజరుశాతాన్ని, ఆయా సెక్షన్లలో పెండింగ్ ఫైల్స్‌ను పరిశీలించారు. ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. కలెక్టర్ వెంట డీఆర్వో రాధికా రమణి, ఏవో స్వర్ణలత ఉన్నారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో దత్తగిరి మహరాజ్ శత జయంతి ఉత్సవాల పోస్టర్‌ను జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి ఆవిష్కరించారు. బర్దిపూర్ ఆశ్రమ స్వామిజీ అవధూత గిరి మహరాజ్ మాట్లాడుతూ శత జయంతి మహోత్సవాలు నవంబర్ 30 నుంచి వచ్చే ఏడాది మార్చి 23తేదీ వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దత్తాత్రేయ జయంతి మహోత్సవాలు డిసెంబర్ 2 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. మహోత్సవాల్లో భాగంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.