చేగుంట,అక్టోబర్19 : విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లో రాణించాలని మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలకేంద్రంలోని తెలంగాణ గిరిజన స్పోర్ట్స్ పాఠశాలలో బుధవారం నిర్వహించిన జోనల్ క్రీడల ముగింపు కార్యక్రమంలోముఖ్య ఆతిథులుగా ప్రతిమాసింగ్, తెలంగాణ గురుకుల అడిషనల్ సెక్రటరీ సర్వేశ్వర్ పాల్గొని మాట్లాడారు. ఈ క్రీడల్లో ఉమ్మడి మెదక్, నిజామాబాద్,ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన,14 బాలికల గురుకుల పాఠశాలకు చెందిన 545మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
గెలుపొందిన వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. ప్రతి విద్యార్థి ఉన్నత చదువులతో పాటు, జిల్లా,రాష్ట్రస్థాయి,జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో చేగుంట ఎంపీపీ మాసుల శ్రీనివాస్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మంచికట్ల శ్రీనివాస్,ఎంపీటీసీ అయిత వెంకటలక్ష్మి, కో-ఆర్డినేటర్ సంపత్‌కుమార్, ప్రిన్సిపాల్ మమత,స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ సుజాత, రమేశ్, రహీం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.