పెద్దశంకరంపేట, అక్టోబర్ 18 : రైతులు వేసిన పంటలనే వేయకుండా పంట మార్పిడి పాటిస్తే అధిక లాభాలు సాధించవచ్చని జిల్లా వ్యవసాయశాఖ అధికారి ఆశాకుమారి పేర్కొ న్నారు. మంగళవారం పెద్దశంకరంపేట మండలంలోని టెంకటి, గోపని వెంటకాపురం, బుజ్రాప్పల్లి గ్రామాల్లో పర్యటించి, పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ.. అధిక వర్షాలతో పత్తిపంట మొక్కలు పసుపు రంగులోకి మారి రోగాల బారిన పడుతున్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయాధికారుల సూచనలు పాటిస్తూ మందుల ను పిచికారీ చేయాలన్నారు. కత్తెర పురుగు నివారణకు తీసుకునే చర్యలను రైతులకు వివరించారు. పత్తి పంటలో క్రిమిసంహరక మందులు పిచికారీ చేసేటప్పుడు వ్యవసాయాధికారుల సూచన లను పాటించాలన్నారు. రైతులు భూ సార పరీక్షలు చేయించి, వాటి ఫలితాల ఆధారంగా పంటలను సాగు చేయాలన్నారు. పంటల సాగులో నూతన పద్ధ తులు పాటించాలన్నారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులను విరివిగా విని యోగించాలని వివరించారు. యాసంగి లో రైతులు తప్పకుండా ఆరుతడి పంటలపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో ఏవో రాజేశ్, ఏఈవోలు స్వాతి, భవాని ఉన్నారు.
అద్దె యంత్రాలు వినియోగించుకోవాలి: జిల్లా ఫైనాన్స్ డీపీఎం సురేశ్‌కుమార్
ఆయా మండలకేంద్రాల్లో ఏర్పాటు చేసిన అద్దె యంత్రాలను రైతులు వినియోగించుకోవాలని జిల్లా ఫైనాన్స్ డీపీఎం సురేష్శ్కుమార్ అన్నారు. పెద్దశంకరంపేట, రేగోడ్ మండలా ల్లో ఐకేపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కస్టమ్ హైరింగ్ సెంటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ జిల్లాలో 8 మండలాల్లో రైతులకు తక్కువ ధరలకే అధునాతన యంత్రాలను అద్దెకు ఇవ్వడానికి కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. అద్దె యంత్రాలు రైతులకు లాభదాయకంగా ఉంటాయన్నారు. త్వరలో అన్ని మండలా ల్లో అద్దె యంత్రాల కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలను పంపామన్నారు. రైతులు అద్దె యంత్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
నీటి తడులను తక్కువగా పెట్టాలి: పర్వతాపూర్‌లో వాల్‌మార్ట్ అధికారులు పర్యటన
రామాయపేట, అక్టోబర్ 18 : కాండం తొలుచు పురుగులతో రైతులు అప్రమత్తంగా ఉండాలని వాల్‌మార్ట్ అధికారులు సూచించారు. రామాయంపేట మండలం పర్వతాపూర్ గ్రామంలో పంట పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతు లకు వివిధ ఆంశాలపై అవగాహన కల్పించారు. వానకాలంలో వరిలో నీటి తడులను తక్కువగా పెట్టాలన్నారు. పురుగు మం దులను సరయైన మోతాదులో వినియోగించాలని సూచిం చారు. ఎక్కువ మోతాదులో రసాయన పురుగు మందులను వాడితే పంట దిగుబడి తక్కువగా వస్తుందన్నారు. రైతులు వ్యవసాయాధికారుల సూచనలు పాటించి పంటలను కాపా డుకోవాలన్నారు. రసాయన ఎరువు వాడకంతో గాలి కాలు ష్యం పెరిగి పంట దిగుబడి తక్కువగా వస్తున్నదని వివరించా రు. సేంద్రియ ఎరువుగా వినియోగం పెంచాలని సూచించా రు. వారి వెంట ఏఈవోలు సాయికృష్ణ, స్వామి ఉన్నారు.