బీఆర్ఎస్తోనే విప్లవాత్మకమైన మార్పులు
బీఆర్ఎస్ (టీఆర్ఎస్) ఏర్పాటుతో దేశంలో విప్లవాత్మకైన మార్పు కచ్చితంగా వస్తుంది. 14 ఏండ్ల పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో ఎనిమిదేండ్ల కాలం లో సీఎం కేసీఆర్ ఎంతో అభివృద్ది చేసి చూ పించారు. బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించే వ్యక్తి సీఎం కేసీఆర్. రైతుబీమా, రైతుబంధు, 24గంటల కరెంట్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీ య, చెక్‌డ్యాంలు, కుంటల మరమ్మతులు, కల్యాణలక్ష్మి, షాదిముభారక్, ఆసరా పింఛన్లు, దళితబంధు లాంటి వినూత్న పథకాలతో తెలంగాణను దేశానికి రోల్ మోడల్‌గా నిలిపారు. బీఆర్ఎస్ ఏర్పాటుతో సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో రావడం వల్ల ఇటువంటి పథకాలు దేశవ్యాప్తంగా అమలవుతాయి.
– ఎంఆర్. ప్రవీణ్‌కుమార్, హద్నూర్ పీఏసీఎస్ డైరెక్టర్ (న్యాల్కల్ మండలం)
మరో ఉద్యమ పార్టీ బీఆర్ఎస్
తెలంగాణ కోసం కేసీఆర్ సృష్టించిన ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ కాగా, భారత్‌ను అన్ని రంగాల్లో అగ్రభాగా న నిలిపేందుకు మరోసారి సృష్టించిందే బీఆర్ఎస్. పలు భాషలపై మంచి పట్టున్న సీఎం కేసీఆర్ జాతీ య రాజకీయాల్లో విజయం సాధిస్తాడనడంలో సందేహం లేదు. బీజేపీ ప్రభుత్వం పేదలను విస్మరిస్తోంది. కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తోంది. నిత్యావసర వస్తువులను సామాన్యులకు అందుబాటులో ఉంచకుం డా ధరలు పెంచుతున్నది. దేశ పగ్గాలు బీఆర్ఎస్ చేతికి వస్తే తెలంగాణ మార్కు పాలన దేశానికి అందుతుంది. ముఖ్యం గా రైతుల అండ కేసీఆర్‌కు ఉంది. వారంత ఐక్యమైతే ఏం జరుగుతుందో తెలిసిందే.
– మన్సూర్, జడ్పీ కో-ఆప్షన్ మెంబర్, నర్సాపూర్
దేశానికి మంచి రోజులు రాబోతున్నాయి
బీఆర్ఎస్ ఏర్పాటుతో దేశానికి మంచిరోజులు రాబోతున్నా యి. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ నేడు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నది. అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే రోల్ మోడల్‌గా మారుతున్నది. కొత్త పార్టీ బీఆర్ఎస్తో అన్ని వర్గాలకు మేలు జరుగునున్నది. ఇప్పటి వర కు దేశంలో రెండు పార్టీల హవానే కొసాగింది. సీఎం కేసీఆర్ ప్రధాని అయితే దేశమంతా మిషన్ భగీరథ నీరు అం దించగలుగుతారు. దళితబంధు, రైతుబంధు పథకాల ద్వా రా చాలామంది జీవితాలు బాగుపడుతాయి. బీఆర్ఎస్తోనే దేశానికి మంచిరోజులు రాబోవడం ఖాయం.
– గుండ్ల మహేందర్‌రెడ్డి (టీఆర్ఎస్ నాయకుడు బొల్లారం మున్సిపల్)
దేశ ప్రజలు కోరుకుంటున్నారు
ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును దేశ రాజకీయాల్లోకి రావాలని భార తదేశ ప్రజలందరూ కోరుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన పథకాలన్నీ దేశంలో అమ లు కావాలంటే సీఎం కేసీఆర్ దేశ రాజకీయా ల్లోకి రావాల్సిందే. సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రజలు జాతీయ స్థాయిలో కేసీఆర్‌కు పట్టం కట్టడం ఖాయం. తెలంగాణ రాష్ర్టాన్ని నెంబర్ 1గా చేసి చూపించినమాదిరిగానే దేశాన్ని కూడా ప్రపంచంలోనే ఉన్నత స్థాయిలో నిలిపే వ్యక్తి సీఎం కేసీఆర్ ఒక్కరే.
– గాజుల వీరేందర్, మండల వైస్ ఎంపీపీ
కేసీఆర్‌తోనే దేశ ప్రజలందరికీ సంతోషం
దేశ ప్రజలందరూ సంతోషంగా ఉండాలంటే సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమవుతుంది. కేంద్ర ప్రభు త్వ పథకాలు సరిగ్గా లేకపోవడంతో దేశంలో ఎవ రూ కూడా సంతోషంగా లేరు. రైతులు, దేశ ప్రజలందరికీ మంచి జరగాలంటే కేసీఆర్ ప్రధానమం త్రి కావాలి. పార్టీలకతీతంగా అన్ని వర్గాల ప్రజలు టీఆర్ఎస్ (బీఆర్ఎస్)కు మద్దతు తెలుపాలి.
– స్రవంతీఅరవింద్రెడ్డి, పీచెర్యాగడి పీఏసీఎస్ చైర్పర్సన్
రాజకీయ ప్రతిభావంతుడు కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పవ్యక్తి, రాజకీయ ప్రతిభావంతుడు, ప్రజల దీవెనలతో అనేక విజయాలు సాధించారు. ప్రత్యేక తెలంగాణ కోసం ప్రజలతో కలిసి పోరాటం చేసి రాష్ట్రం సాధించారు. సాధించిన రాష్ర్టాన్ని బంగారు తెలంగాణ వైపు మళ్లించారు. ఇప్పుడు దేశ అభివృద్ధిపై దృష్టిపెట్టాడు. ప్రతిపక్ష పార్టీలతోపాటు ప్రజలు కూడా ఆదరిస్తున్నారు. దేశంలో విజయం సాధిస్తారనే నమ్మకంతో ఉన్నాం. జై కేసీఆర్.. జై బీఆర్ఎస్.
– శ్యామలానాగరాజు ,జడ్పీటీసీ, కోహెడ
బీఆర్ఎస్తోనే అన్ని వర్గాలకు న్యాయం
సీఎం కేసీఆర్ స్థాపించిన జాతీయ పార్టీ బీఆర్ఎస్తోనే దేశంలోని అన్ని వర్గాలకు న్యాయం జరుగుతది. సీఎం కేసీఆర్‌కు దేశ రాజకీయాలపై స్పష్టమైన అవగాహన ఉంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై దేశ ప్రజలకు నమ్మ కం లేదు. ఇప్పుడున్న పరిస్థితిలో దేశ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధి దేశంలో జరిగితే భారతదేశం త్వరగా అభివృద్ధి చెందడం ఖాయం.
– తాజ్‌మహ్మద్, మైనార్టీ నాయకుడు, మద్దూరు
పేదలకు మేలు
బీఆర్ఎస్తో పేదలకు మేలు జరుగుతుంది. తెలంగాణలో కల్యాణలక్ష్మి లాంటి పథకాలు దేశంలో కూడా అమలు కావా లి. కేంద్రంలో ఇప్పటివరకు చాలా ప్రభుత్వాలు వచ్చాయి. చాలా మంది ప్రధానులు అయ్యారు. తెలంగాణ నుంచి కేసీఆర్ ప్రధాని అయితే రాష్ర్టానికి, దేశానికి మంచి జరగడం ఖాయం. సంక్షేమ పథకాలు అమలు కావాలంటే, పెరుగుతున్న నిత్యావసర ధర లు తగ్గాలంటే కేసీఆర్‌తోనే సాధ్యం. బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించాలి.
– ఎర్రాజు లావణ్య, అడ్వకేట్, సిద్దిపేట
అందరికి న్యాయం జరగాలి
దేశంలో ఉన్న నాయకుల్లో సీఎం కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడు. తెలంగాణలో జరుగుతున్న మంచి పనులు దేశంలో కూడా అమలుకావాలి. పథకాలు అందరికీ అందాలి. పేదలకు న్యాయం జరగాలి. సంక్షేమం, అభివృద్ధి సమానంగా ముందుకు కొనసాగితే సమగ్రాభివృద్ధి సాధ్యం. బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించాలి.
– సరిత, అడ్వకేట్, సిద్దిపేట