మెదక్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): టెక్నాలజీ ఉపయోగించడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నదని, టెక్నాలజీతో ఎన్నో కీలకమైన కేసులను చేధించామని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం అన్ని జిల్లాల పోలీస్ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2.0 వర్షన్ మొబైల్ ఫోన్ బేస్డ్గా తయారు చేయడం జరిగిందన్నారు. సంబంధిత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ సమయంలో బయటకు వెళ్లినప్పుడు ఇన్వెస్టిగేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని ఫొటోలు, వీడియోలను వెనువెంటనే అప్లోడ్ చేయవచ్చని సూచించారు. కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారుల వరకు 2.0 వర్షన్ చాలా ఉపయోగపడుతుందన్నారు.
టెక్నాలజీతో కూడిన ECOPS అప్లికేషన్లను 2001లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టెక్నాలజీ ఉపయోగించడం అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి తేవడం గురించి 2018లో సీసీటీఎన్ఎస్ 1.0 ను ప్రారంభించినట్లు పేర్కొన్నారు. టెక్నాలజీ ఉపయోగించడంలో రాష్ట్రంలో ఉన్న పోలీస్ అధికారులకు సిబ్బందికి మంచి పరిజ్ఞానం పెంపొందిందని తెలిపారు. రాత్రి సమయంలో పెట్రోలింగ్, బ్లూకోల్డ్స్ విధులు నిర్వహించే అధికారులు సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లినప్పుడు అకడున్న మెటీరియల్ ఎవిడెన్స్, ఫొటోలు, వీడియోలు తీసి అప్పోడ్ చేసుకునే విధంగా యాప్‌ను తయారు చేశారన్నారు.
దీనిద్వారా క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ పెరుగుతుందని, తద్వారా నేరస్తులకు శిక్షలు పడే అవకాశం ఎకువగా ఉంటుందన్నారు. సీసీటీఎన్ఎస్ 2.0 నూతన టెక్నాలజీతో కూడిన వర్షన్‌ను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రంలోని పోలీస్ అధికారులకు, సిబ్బందికి డీజీపీ ఆఫీస్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన కల్పించారు. నూతన టెక్నాలజీ, ఫ్యూచర్ టెక్నాలజీ దృష్టిలో పెట్టుకుని సీసీటీఎన్ఎస్ 2.0 వెర్షన్‌ను తయారు చేయడానికి కృషి చేసిన పోలీస్ అధికారులను సిబ్బందిని అభినందించారు. సమావేశంలో మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, జిల్లా అదనపు ఎస్పీ బాలస్వామి, మెదక్ డీఎస్పీ సైదులు, డీసీఆర్బీ సీఐ రవీందర్, ఎస్బీ సీఐ నవీన్ బాబు, జిల్లాలోని సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు.