జిన్నారం, అక్టోబర్ 14: కొడకంచి గ్రామంలోని సర్వే నంబర్ 36,37,38లో అధికారులు శుక్రవారం పోడు భూము ల సర్వే చేపట్టారు. రైతుల నుంచి వచ్చిన దరఖాస్తుల ఆధారంగా అధికారులు, రైతులతో కలిసి సర్వే కోసం భూముల వద్దకు వెళ్లగా ఇవి తాము కొనుగోలు చేసిన పట్టా భూముల ని, ఇందులో సర్వే చేయడానికి ఒప్పుకోమని చంద్రారెడ్డి, వరప్రసాద్‌రెడ్డి, పెంటాగౌడ్ ఆందోళన చేశారు. ఈ సర్వే నంబర్లలోని భూములను తాము కొనుగోలు చేశామని, ఇదే విషయమై కోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీలను చదువుకోవాలని పంచాయతీ కార్యదర్శి సాధ న, అటవీ శాఖ బీట్ అధికారికి వారు తెలిపారు. మీ వద్ద పట్టా పాస్ పుస్తకాలు ఉంటే చూపించండి, సేల్డీడ్లు, అగ్రిమెంట్ కాపీలు వద్దని పంచాయతీ కార్యదర్శి సంబందిత వ్యక్తులకు తెలిపారు. తాను జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోడు భూముల సర్వే చేస్తున్నానని, తమ విధులకు ఆటంకం కలిగించొద్దని సూచించారు.
దరఖాస్తుల ఆధారంగా భూముల వద్ద రైతుల ఫొటో లు తీసుకునేందుకు అధికారులు సిద్ధం అవగా తమ భూము ల వద్ద ఫొటోలు దిగొద్దని పట్టాదారులుగా చెబుతున్న వారు అడ్డుకున్నారు. దీంతో కొద్ది సేపు అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. జిన్నారం ఎస్ఐ సిద్ధి రాములు పోలీస్ సిబ్బందితో కలిసి అక్కడి చేరుకొని ఇరు వర్గాలతో మాట్లాడారు. ఉన్నతాధికారుల ఆదేశానుసారం పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించొద్దని, అలాగే కోర్టు ఆర్డర్‌ను పాటించాలని రెండు వర్గాలకు సూచించారు. కొద్ది సేపటికి తహసీల్దార్ దశరథ్ అక్కడి చేరుకొని రెండు వర్గాలతో మాట్లాడారు. చట్టప్రకారం పనులు జరుగుతాయని, ఎవరు ఇబ్బంది పడొద్దని సూచించారు. ఫారెస్ట్ రేంజ్ అధికారి షాహీన్ సర్వే ప్రాంతానికి వచ్చి ఇవి పోడు భూ ములని, దీనికి సంబంధించి తమకు కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని తెలుపుతూ నోటీసులు మరో వర్గానికి ఇస్తుండగా వారు తీసుకోలేదు. సర్వే జరి గే ప్రాంతంలో ఇప్పటికిప్పుడు నోటీసులు ఇస్తే తీసుకోమన్నారు. సాయంత్రానికి ఇరు వర్గాలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కార్య క్రమంలో సర్పంచ్ శెట్టి శివరాజ్, మాజీ సర్పంచ్ శ్రీశైలంయాదవ్, ఉపసర్పంచ్ అభిలాశ్గౌడ్, గ్రామస్తు లు పాల్గొన్నారు.