సీఎం కేసీఆర్ కృషితో గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ జిగేల్ మంటున్నది. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ ప్రధాన మార్గాన్ని సీఎం కేసీఆర్ తొలిసారి ప్రాతినిథ్యం వహించిన సమయంలో ఆరులైన్లుగా అభివృద్ధి చేశారు. ఆ రోడ్డు డివైడర్‌పై అందమైన చెట్లు, బట్టర్ఫ్లై లైట్లు ఏర్పాటు చేయించారు. మున్సిపల్ పాలకవర్గం సైతం ఈ రహదారికి మరిన్ని సొబగులు అద్దింది. రూ.8లక్షలతో బట్టర్ ఫై లైట్లకు రంగుల ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయించింది. దీంతో రాత్రిళ్లు జిగేలు మంటున్నది. వాహనదారులు కొత్త అనుభూతికి లోనవుతున్నారు. అలాగే పట్టణంలోని సంగాపూర్ రోడ్డు, పిడిచెడ్ రోడ్డు, తూప్రాన్ వైజంక్షన్ వరకు రూ.1.50 కోట్లతో బట్టర్ఫ్లై లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పట్టణం విద్యుత్ వెలుగుల్లో మెరిసి పోనున్నది.
గజ్వేల్, అక్టోబర్ 13: గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్నది. సీఎం కేసీఆర్, మం త్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో పట్టణాభివృద్ధికి నిధుల కొరత లేకపోవడంతో దినదిన ప్రవర్ధమానంగా పనులు కొనసాగుతున్నాయి. సీఎం కేసీఆర్ తొలిసారి గజ్వేల్‌కు ప్రాతినిథ్యం వహించినప్పుడు గజ్వేల్-ప్రజ్ఞాపూర్ ప్రధాన మార్గాన్ని అభివృద్ధి చేసి ఆరులేన్ల మార్గాన్ని ఏర్పాటు చేశారు. రోడ్డు మధ్యలోని డివైడర్‌పై అందమైన చెట్లు, బట్టర్ఫ్లై లైట్లను బిగించారు. ప్రధాన రహదారికి మున్సిపల్ పాలకవర్గం మరిన్ని సొబగులు దిద్దారు. రూ.8 లక్షలతో ప్రధాన రహదారి డివైడర్‌పై గల బట్టర్ ఫ్లై లైట్లకు రంగుల ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. దీంతో ప్రతిరోజు పట్టణంలో రాత్రి పండుగ వాతావరణాన్ని తలపిస్తుంది. వాహనదారులు ఆహ్లాదకర అనుభూతికి లోనవుతున్నారు. ఈ మార్గంలో ప్రయాణిస్తుంటే హైదరాబాద్ హైటెక్ సిటీ, జుబ్లీహిల్స్ ప్రాంతాల్లో వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. పట్టణంలోని సంగాపూర్ రోడ్డు, పిడిచెడ్ రోడ్డు, తూప్రాన్ వైజంక్షన్ వరకు బట్టర్ఫ్లై లైట్లను ఏర్పాటు చేయడానికి మున్సిపల్ పాలకవర్గం తీర్మానించింది. ఈ మేరకు పనులు కూడా ఇటీవల ప్రారంభించారు. మూడు మార్గాల్లో బట్టర్ఫ్లై లైట్లను ఏర్పాటు చేయడానికి రూ.1.50కోట్లు ఖర్చు చేయనున్నారు.
గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో వేగంగా అభివృద్ధి చెందింది. ఒకప్పుడు మామూలు మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న గజ్వేల్ ఇప్పుడు దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛత అవార్డును అందజేసింది. పట్టణంలో అవసరమైన మౌలిక వసతులను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేస్తు న్నాం. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు, 24 గంటల విద్యుత్ అందించడంతో పాటు ప్రతిరోజూ పారిశుధ్య నిర్వహణలో భాగంగా ఇంటింటికీ చెత్తను సేకరిస్తు న్నాం. అంతర్గత రోడ్ల నిర్మాణానికి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు నిధులు మంజూరు చేశారు. మరో మూడు నెలల్లో పనులు ప్రారంభించే అవకాశం ఉంది. మరింత అభివృద్ధి చేయడానికి పాలకవర్గం, ప్రజల సహకారంతో ముందుకు సాగుతాం.
-ఎన్సీ రాజమౌళి, మున్సిపల్ చైర్మన్, గజ్వేల్