సిద్దిపేట/చిన్నకోడూర్, అక్టోబర్ 13 : దేశంలోని అన్ని వర్గాల నుంచి బీఆర్ఎస్ పార్టీకి అపూర్వ మద్దతు వస్తున్నదని సిద్దిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు సంపత్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లాకేంద్రమైన సిద్దిపేటలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో పట్టణంలో 15వ వార్డు గాడిచెర్లపల్లికి చెందిన ఎస్సీ సంఘం నాయకులు కౌన్సిలర్ సులోచన శ్రీనివాస్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ ఉమారాణి శ్రీనివాస్‌తో కలిసి బీఆర్ఎస్ పార్టీకి స్వచ్ఛందంగా రూ.20,016 విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో ప్రజావ్యతిరేక పాలన చేస్తున్న బీజేపీకి చమరగీతం పాడేందకు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారన్నారు. సీఎం కేసీఆర్ మంత్రి హరీశ్‌రావుల నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ వెంట నడుస్తామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నాయకులు బి.రవీందర్, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పట్టణ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు సుండు స్వామి, వార్డు కమిటీ అధ్యక్షుడు కనకయ్య, ఎస్సీ సంఘం అధ్యక్షుడు సుండు లింగం, ఉపాధ్యక్షుడు పెద్ద మల్లేశం, కోశాధికారి యాదగిరి, ప్రధాన కార్యదర్శి కనకయ్య, నాయకులు ఎల్లుపల్లి రవి, సుండు రాజు, సుండు నర్సింగం, అంజి, నాగరాజు,సిద్దన్నపేట రాజు, నరేశ్, రాజ్‌కుమార్, రాజు, భూమరాజు, తుపాకీ భాను, జంగింటి రాజు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ (టీఆర్ఎస్) పార్టీకి మద్దతుగా బక్రిచెప్యాల కుమ్మరి సంఘం రూ.5016 స్వచ్ఛందంగా విరాళాన్ని క్యాంప్ కార్యాలయంలో కుమ్మరి సంఘం జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి నెల్లుట్ల విజయ్, అర్బన్ మండల అధ్యక్షుడు ఎద్దు యాదగిరి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దరిపల్లి శ్రీను విరాళాన్ని మంత్రి హరీశ్‌రావు పీఏ రాముకు అందజేశారు. కార్యక్రమంలో గ్రామ కుమ్మరి సంఘం నాయకులు నరసింహులు, వెంకట్, మహేశ్, యాదగిరి, మల్లయ్య, శంకరయ్య, రాజు, లక్ష్మణ్, అశోక్, శ్రీకాంత్, బాలయ్య, నవీన్, ఎల్లయ్య, నాగరాజు, అర్జున్, రోహిత్ పాల్గొన్నారు.
టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మెరుగు మహేశ్ ఆదేశాల మేరకు గురువారం బీఆర్ఎస్కు విద్యార్థులు ఒక్కోరూపాయి విరాళం అందజేశారు. మండలంలోని ఇబ్రహీంనగర్ మోడల్ స్కూల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులు స్వచ్ఛందం గా విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీ మండలాధ్యక్షుడు గుజ్జరాజు, ఉపాధ్యక్షుడు శ్రావణ్ గౌడ్, కుంబాల మహేశ్, ప్రధాన కార్యదర్శి సుగేందర్రెడ్డి, పడిగె లింగం, అధికార ప్రతినిధి సురేందర్, కార్యదర్శి మంతాపురి రాజు, సోషల్ మీడియా కన్వీనర్ చందు, ఇబ్రహీంనగర్ గ్రామశాఖ అధ్యక్షుడు నాగరాజు, టీఆర్ఎస్వీ జిల్లా నాయకులు శెట్టిపల్లి భాను పాల్గొన్నారు.