సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 9: మహనీయుల జీవితాలు అందరికీ ఆదర్శనీయమని, సంగారెడ్డి అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. మహాకవి వాల్మీకి జయంతిని పురస్కరించుకొని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కలెక్టరేట్లోని నిర్వహించిన జ యంతి ఉత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. అనంతరం వాల్మీకి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఆయన మాట్లాడుతూ మహాకవి వాల్మీకి గొప్ప కావ్యమైన రామాయణాన్ని రచించి ఆదర్శ పురుషుడికి ఉండాల్సిన లక్షణాలు, మానవ సంబంధాలు, విలువలను సమాజానికి అందించారని వివరించారు. వాల్మీకి జీవితం అందరికీ ఆదర్శ ప్రాయమన్నారు. వసుదైక కుటుంబం అనే భావన రామాయణంతో ముడిపడి ఉన్నదన్నారు. రామాయణాన్ని రచించిన మహాకవి వాల్మీకి జయంతిని అధికారికంగా జరుపుకోవడం సంతోషకరమన్నారు.
వాల్మీకి సంతతికి చెందిన జాతుల వారు మరింత అభివృద్ధిలోకి రావాల్సిన ఆవశ్యకత ఉన్నదన్నారు. విద్యతోనే అది సాధ్యమని పేర్కొన్నారు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నతంగా ఎదిగేలా సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం పలువురు వక్తలు మహర్షి వాల్మీకి జీవిత విశేషాలను తెలియజేస్తూ, మనిషిలో పరివర్తన ఎలాంటి వారినైనా మహనీయునిగా మార్చుతుందనడానికి వాల్మీకి జీవితమే నిదర్శనమని చెప్పారు. మానవ సంబంధాలు, విలువలు, నీతి, ధర్మం, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం తదితర విషయాలను తన రామాయ ణ కావ్యం ద్వారా వాల్మీకి తెలియజేశారని, అలాంటి మ హనీయుడు చూపిన బాటలో నడవాలని అదనపు కలెక్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జగదీశ్, వాల్మీకి బోయ సం ఘం జిల్లా అధ్యక్షుడు పండరి, రవికుమార్, వివిధ కుల సం ఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి
మెదక్ అర్బన్, అక్టోబర్ 9 : మహర్షి వాల్మీకి జయంతి ని పురస్కరించుకొని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో ఆదివారం ఎస్పీ రోహిణి ప్రియదర్శిని వాల్మీకి చిత్ర ప టానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమం లో ఎస్.బి.సి.ఐ నవీన్‌బాబు, ఎస్సై విఠల్, మహిళా ఎస్సై నాగరాణి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.