పెద్దశంకరంపేట/ చేగుంట, అక్టోబర్ 7 : దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పెద్దశంకరంపేటలోని తిర్మలాపురం, రాణి శంకరమ్మ గడీకోటలో ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహలను శుక్రవారం తిర్మలాపురం చెరువులో నిమజ్జనం చేశారు. రాణి శంకరమ్మ గడీకోటలో గడికోట ఉత్సవ కమిటీ, తిర్మలాపురం గ్రామంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో దుర్గామాత అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో శోభాయాత్ర నిర్వహించారు. బాజాభజంత్రీలు, భజనలు, యువకుల నృ త్యాల మధ్య శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం స్థానిక తిర్మలాపురం శివారులోని చెరువులో నిమజ్జనం చేశారు.
నార్సింగి మండల కేంద్రంలో దుర్గామాత నిమజ్జనాన్ని శోభాయమానంగా నిర్వహించారు. అమ్మవారి వద్ద పూజలు ఆందుకున్న లడ్డూను ఆర్యవైశ్య సంఘం మండలాధ్యక్షుడు, రైస్ మిల్లర్స్ ఆసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రం శ్రావణ్‌కుమార్ రూ.51వేలకు దక్కించుకున్నారు. కార్యక్రమంలో దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు శేఖర్, డాక్టర్ హర్షవర్ధన్ పాల్గొన్నారు. కర్నాల్‌పల్లిలో నిర్వహించిన శోభాయాత్రలో ఇబ్రహీంపూర్ సొసైటీ చైర్మన్ కొండల్‌రెడ్డి, స్థానిక నాయకుడు వంటరి అశోక్‌రెడ్డితోపాటు ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చందాయిపేటలో జరిగిన శోభాయాత్రలో సర్పంచ్ స్వర్ణలతాభాగ్యరాజ్, ఉప సర్పంచ్ సంతోష్‌కుమార్, వైస్ ఎంపీపీ మున్నూర్ రామ చంద్రం, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.