పెద్దశంకరంపేట, అక్టోబర్ 7 : పాతకక్షలు మనసులో పెట్టుకొని పథకం ప్రకారం పంట పొలంలో విద్యుత్ వైర్లు అమ ర్చి వ్యక్తిని హత్య చేసిన సంఘటన పెద్దశంకరంపేట మండలం జూకల్ గ్రామ శివారులో గురువారం సాయంత్రం చోటు చేసుకు న్నది. జరిగిన హత్యను కరెంట్ షాక్‌తో మృతి చెందాడని చిత్రీకరించేలా ప్రయత్నించిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం పెద్దశంకరంపేట పోలీస్‌స్టేషన్‌లో మెదక్ డీఎస్పీ సైదులు కేసు వివరాలను వివరించారు.
పాపన్నపేట మండలంలోని చీకోడ్ గ్రామానికి చెందిన మంగళి సాయిలును అదే గ్రామానికి చెందిన మంగళి శ్రీరామ్ వరుసకు మామ, అల్లుడు. వీరిద్దరి మధ్యన భూతగాదా నడుస్తున్నది. ఈ క్ర మంలో సాయిలును హత్య చేసేందుకు శ్రీరామ్ కుట్ర పన్నాడు. సాయిలు ప్రతిరోజూ తన పొలానికి నీళ్లు పారబెట్టడానికి వచ్చే వా డు. దీనిని అవకాశంగా తీసుకున్న శ్రీరామ్.. సాయిలుకు చెం దిన వ్యవసాయ పొలంలో గట్టుమీద ఇన్సులేషన్ కేబుల్ తీగను అమ ర్చి, విద్యుత్ షాక్ తగిలేలా అమర్చాడు. ఇది తెలియని సాయిలు రోజూ మాదిరిగానే పొలం గట్టుపై నడుచుకుంటూ బోరు వేయడానికి వెళ్లగా గట్టుపై అమర్చిన విద్యుత్ తీగను తాకడంతో కరెంట్‌షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడి కుటుంబ సభ్యులు సాయిలు మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టగా మంగళి శ్రీరామ్ తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. తమ మధ్యన భూతగాదాలున్నాయని.. దీంతో గొడవపడ్డామని వివరించారు. ముందస్తు పథకం ప్రకారం విద్యుత్ వైర్ ఏర్పాటు చేసి సాయిలును హత్య చేసి, విద్యుత్‌షాక్‌తోనే మరణించినట్టుగా నమ్మించానని తెలిపాడు. మృతుడి భార్య స్వరూప ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, శ్రీరామ్ ను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు. సమావేశంలో అల్లాదుర్గం సీఐ జార్జి, రేగోడ్ ఎస్సై సత్యనారాయణ ఉన్నారు.