మద్దూరు(ధూళిమిట్ట), సెప్టెంబర్ 29 : మద్దూరు, ధూళిమిట్ట మండలాల పరిధిలోని వివిధ గ్రామాల్లో మహిళలకు బతుకమ్మ చీరలను ప్రజాప్రతినిధులు అందజేశారు. ధూళిమిట్టలో సర్పంచ్ దుబ్బుడు దీపికావేణుగోపాల్‌రెడ్డి, జాలపల్లిలో వరలక్ష్మీసాగర్, సలాఖపూర్‌లో సర్పంచ్ భాస్కర్‌రెడ్డి, మర్మాములలో వైస్ ఎంపీపీ మలిపెద్ది సుమలతామల్లేశం, సర్పంచ్ సుందరగిరి స్రవంతీపరశురాములుగౌడ్ మహిళలకు బతుకమ్మ చీరలను అందజేశారు.
గజ్వేల్, సెప్టెంబర్ 29 : ఆర్అండ్ఆర్ కాలనీ పల్లెపహాడ్‌లో మహిళలకు సర్పంచ్ రజితాగోవింద్, ఉపసర్పంచ్ లలితానాగరాజు బతుకమ్మ చీరలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కల్పన మల్లేశం, పంచాయతీ కార్యదర్శి స్వామి, డీలర్ నర్సింహులుపాల్గొన్నారు.
కొండపాక, సెప్టెంబర్ 29 : మండలంలోని ముద్దాపూర్‌లో సర్పంచ్ ఉమాఅంజిరెడ్డి ఆధ్వర్యలో మహిళలకు బతుకమ్మ చీరలు అందజేశారు. అనంతరం లబ్ధిదారులకు నూతన పింఛన్‌కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాంరెడ్డి, ఉపసర్పంచ్ మహేశ్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు స్వామి పాల్గొన్నారు.
కొమురవెల్లి, సెప్టెంబర్ 28 : తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగ కానుకగా ఆడపడుచులకు చీరలు అందజేస్తున్నదని ఎంపీపీ తలారి కీర్తన అన్నారు. గురువారం మండలంలోని మర్రిముచ్చాలలో సర్పంచ్ పద్మతో కలిసి మహిళలకు బతుకమ్మ చీరలు అందజేశారు. అనంతరం గ్రామంలో పలువురు బాధిత కుటుంబ సభ్యులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పద్మ తదితరులు పాల్గొన్నారు.
హుస్నాబాద్ రూరల్, సెప్టెంబర్ 29 : మండలంలోని మడద, మహ్మదాపూర్, నాగారం, రాములపల్లి తదితర గ్రామాల్లో ప్రజాప్రతినిధులతో కలిసి ఎంపీపీ మానస బతుకమ్మ చీరలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక బతుకమ్మ పండుగ అని అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో కుమారస్వామి, ఎంపీవో సత్యనారాయణ, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
కోహెడ, సెప్టెంబర్ 29 : మండలంలోని గుండారెడ్డిపల్లిలో సర్పంచ్ అశోక్‌రెడ్డి, ఎంపీటీసీ కల్యాణి ప్రభుత్వం సరఫరా చేసిన బతుకమ్మ చీరలను మహిళలకు అందజేశారు. నాగసముద్రాలలో సర్పంచ్ రవీందర్, ఎంపీటీసీ మల్లవ్వ, శనిగరంలో సర్పంచ్ జయశ్రీ, ఎంపీటీసీ స్వప్న మహిళలకు బతుకమ్మ చీరలను అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో నాయకులు కనకయ్య, రవీందర్, పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
హుస్నాబాద్ టౌన్, సెప్టెంబర్ 29 : బతుకమ్మ పండుగను పురస్కరించుకుని పట్టణంలోని ఎనిమిది కేంద్రాల్లో మహిళలకు బతుకమ్మ చీరలను ప్రజాప్రతినిధులు అందజేశారు. పట్టణంలోని 19వ వార్డులో మహిళలకు కౌన్సిలర్ బొజ్జ హరీశ్ బతుకమ్మ చీరలు అందజేశారు.