దౌల్తాబాద్, సెప్టెంబర్ 22: పాత కక్షలతో గుర్తుతెలియని వ్య క్తులు ఓ వ్యక్తిని సజీవ దహనం చేసిన ఘటన దౌల్తాబాద్ మం డలం ఇందుప్రియల్ గ్రామంలో గురువారం ఉదయం జరిగింది. దౌల్తాబాద్ ఎస్సై చైతన్యకుమార్‌రెడ్డి వివరాల ప్రకారం.. ఇందుప్రియల్ గ్రామానికి చెందిన హనుమాండ్ల వెంకయ్య(45)కు 35ఏండ్ల క్రితం మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నాగ్సన్పల్లికి చెందిన స్వరూపతో పెండ్లి జరిగింది. కొన్నేండ్ల తర్వాత అత్తపై లైంగికదాడి చేసి, జైలుకు వెళ్లి రెండు నెలల క్రితం ఇంటికొచ్చాడు. 15 రోజులుగా గొడవ పడుతుండడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.
వెంకటయ్యకు కొడుకు, కూతురు ఉండగా, కొన్నేండ్ల క్రితం కొడుకు చనిపోయాడు. కూతురు ప్రణతిని అదే గ్రామానికి చెందిన కనకయ్యకు ఇచ్చి పెండ్లి చేశారు. అతని నిర్వాకం వల్లే స్వరూప వెళ్లిపోయిందని కూతురు, అల్లుడితో రోజూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం గ్రామంలో వెంకటయ్య ఇంటి ముందు వెంకటయ్యను ఎవరో తలపై కొట్టి, సజీవ దహనం చేసి చంపారని చుట్టూ పక్కల వారు వెంకటయ్య అన్న ఐలయ్యకు సమాచారం అందించారు. ఐలయ్య వచ్చి చూసేసరికి అతను మృతిచెందడంతో పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘట నా స్థలానికి వచ్చి, మృతదేహాన్ని గజ్వేల్‌కు దవాఖానకు తరలించారు. అత్తపై లైంగికదాడి నేపథ్యంలో కూతురు ప్రణతి, అల్లుడు కనకయ్య, బామ్మర్ది శ్రీహరి కలిసి వెంకటయ్యను హతమార్చారని ఐలయ్య ఫిర్యాదు చేశాడు.