పేదలకు భరోసా కలగాలంటే.. పిల్లలకు కార్పొరేట్ స్థాయి ఉచిత విద్య అందాలంటే.. కులవృత్తులకు పూర్వవైభవం రావాలంటే.. దేశానికి వెన్నెముకగా నిలిచే కర్షకుల జీవితాల్లో వెలుగులు నిండాలంటే.. సబ్బండవర్గాలకు బతుకునిస్తున్న తెలంగాణ మాదిరి పథకాలు దేశమంతా అమలుకావాలంటే.. అవినీతి, అప్పులమయమైన కేంద్రంలో నాయకత్వ మార్పు జరగాలి. రాజకీయాలపై అపార అనుభవం.. ప్రగతి గురించి ఆలోచించే సంక్షేమ సారథి.. మన సీఎం కేసీఆర్‌తో సాధ్యమవుతుందని ప్రముఖులు ముక్తకంఠంతో చెబుతున్నారు. రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తూ విప్లవాత్మక పథకాలతో పేదలకు భరోసాగా నిలుస్తున్న ఆయన సేవలు అవసరమని స్పష్టం చేస్తున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తేనే దేశానికి మేలు జరుగుతుందని ఘంటాపథంగా చెబుతున్నారు.
-సిద్దిపేట, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
రాయికోడ్, సెప్టెంబర్ 21: మండలంలోని రహదారులకు మహర్దశ పట్టనున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగు, తాగునీరు, విద్య, వైద్యం, రవాణా రంగాలకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తున్నది. ఇదే క్రమంలో మట్టి, మెటల్ రోడ్లున్న గ్రామాలను గుర్తించి బీటీ రోడ్లుగా మార్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధ్దితో కృషి చేస్తున్నది. ప్రస్తుతం రాయికోడ్ మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు సాగించేందుకు సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆ రోడ్లుపై ప్రయాణం నరకప్రాయం
ఏండ్ల తరబడి మరమ్మతులకు నోచుకోక ఆ రోడ్లుపై ప్రయాణం నరకప్రాయంగా మారింది. దీంతో వాహనదా రులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంతలయమైన రోడ్లు బాగు చేసేందుకు, కొత్తగా బీటీ రోడ్లు వేసేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో ఆ వెతలు తీరనున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ప్రత్యేకంగా కృషి చేసి, మండలానికి రూ.14.85 కోట్ల నిధులు మంజూరు చేయించారు. ఈ నిధులతో బీటీ రోడ్లను నిర్మించనున్నారు. మండలంలో అభివృద్ధి పనుల నిమిత్తం అందోల్ ఎమ్మెల్యే పర్యటించిన క్రమంలో నేరుగా ఆయన దృష్టికి స్థానికులు ఈ సమస్యలు తీసుకొచ్చారు. దీంతో ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుని నూతన రోడ్ల నిర్మాణానికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లి, రూ.14.85 కోట్లు విడుదల చేయించారు. నిధులు మంజూరు కావడంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో నిర్లక్ష్యం..
సింగీతం, ఎన్కపల్లి, ఔరంగనగర్, హస్నాబా ద్, కోడూర్ గ్రామాలతో పాటు మండలంలో గతంలో వేసిన రోడ్లు నాసిరకంగా ఉన్నా యి. దీంతో కొన్ని రోజులకే పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ రోడ్లపై ప్రయాణించాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. నిధుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌కు
ప్రత్యేక కృతజ్ఞతలు.
– మల్లికార్జున్ పాటిల్, జడ్పీటీసీ రాయికోడ్
అభివృద్ధి పరుగులు ..
తెలంగాణ ఏర్పాడిన తర్వాత ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చంటి రాహుల్‌కిరణ్ కృషితో రాయికోడ్ మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి పథం లో పరుగులు తీస్తున్నది. గతంలో అభివృద్ధిని పట్టించుకున్న వారు ఒక్కరూ లేకుండే. స్థానిక నాయకుడు ఎమ్మెల్యే కావడంతోనే మండలం మరింత అభివృద్ధి చెందుతున్నది.
– ప్రభాకర్‌రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు
సంతోషంగా ఉంది..
ఏండ్లుగా నిర్లక్ష్యానికి గురైన మట్టిరోడ్డును బీటీగా మార్చేందుకు ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ప్రత్యేకంగా కృషి చేసి నిధులు మంజూరు చేయించడం చాలా సంతోషంగా ఉంది. రోడ్ల పనులు పూర్తయితే ఆయా గ్రామా ల మధ్య ప్రయాణం సాఫీగా సాగుతుంది. దీంతో గ్రామాల అభివృద్ధి మరింగా ఉంటుంది. నిధులు మంజూరు చేసినందుకు ప్రభుత్వానికి, ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌కు రుణపడి ఉంటాం.
– మమతా అశోక్‌కుమార్, ఎంపీపీ, రాయికోడ్
మరింత అభివృద్ధి చేస్తా
గత పాలకుల నిర్లక్ష్యంతో రాయికోడ్ మండలం అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నది. ఈ మండలాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు శాయశక్తులా కృషిచేస్తున్నారు. మండలంలోని అన్ని గ్రామాల రోడ్లుకు మరమ్మతులు చేయించేందుకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు కృషితో నిధులు మంజూరు చేయించా. మండలానికి మరిన్ని నిధులు తెస్తా.
– చంటి క్రాంతికిరణ్, ఎమ్మెల్యే, అందోల్