వెల్దుర్తి, సెప్టెంబర్ 19: జాతీయస్థాయి కరాటే పోటీల్లో వెల్దుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు అధిక మెడల్స్ సాధించడమే కాకుండా ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించి సత్తాచాటారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఆదివారం సినీ హిరో సుమన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో దేశంలోని 20 రాష్ర్టాలకు చెందిన సుమారు 2వేల మంది విద్యార్థులు పాల్గొనగా, వెల్దుర్తి ఉన్నత పాఠశాలకు చెందిన 35 మం ది విద్యార్థులు వివిధ రకాల పోటీల్లో పాల్గొని 45గోల్డ్, 10 సిల్వర్ మెడల్స్‌తో మొత్తం 55 పతకాలు సాధించారు.
పోటీల్లో పాల్గొ న్న అందరిలో అధిక పతకాలు సా ధించిన వెల్దుర్తి పాఠశాల విద్యార్థులను అభినందించిన హీరో సుమన్ ఓవరల్ చాంపియన్ షిప్‌ను అందజేశారు. అధిక పతకాలు సాధించి, ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించిన విద్యార్థుల ను ఎంఈవో యాదగిరి, హెచ్ఎం సాంబయ్య, పీడీ ప్రతాప్‌సింగ్ అభినందించారు. ఈ సందర్భంగా ఎంఈవో యా దగిరి, హెచ్ఎం సాంబయ్యలు మాట్లాడుతూ పీడీ ప్రతాప్‌సింగ్ ప్రత్యేక శిక్షణలో రాటుదేలిన విద్యార్థులు కరాటేలో సత్తా చాటారన్నారు.