పటాన్చెరు/పటాన్చెరు టౌన్, సెప్టెంబర్19: ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. పటాన్చెరులో ఉదయం నుంచే ఎమ్మెల్యే నివాసం వద్ద సందడి ప్రారంభమైంది. అభిమానులు, కుటుంబ సభ్యుల మధ్య ఎమ్మెల్యే కేక్ కట్ చేశారు. రుద్రారం గ్రామంలోని సిద్ధి గణేశ్ దేవస్థానంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పట్టణంలోని మహాదేవుని ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిజాముద్దిన్ షహీద్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చిల పాస్టర్లు ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జీఎమ్మార్ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఎమ్మెల్యే వేడుకలకు ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి హాజరై ఎమ్మెల్యేతో కేక్ కట్ చేయించారు. పేద, బడుగు బలహీనవర్గాల కోసం నిరంతరం శ్రమిస్తున్నారని ఎంపీ కొనియాడారు.
పటాన్చెరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని ప్రశంసించారు. మాజీ ఎమ్మెల్యే కే.సత్యనారాయణ, పటాన్చెరు డీఎస్పీ భీంరెడ్డి, సీఐలు, ఎస్సైలు శుభాకాంక్షలు తెలిపారు. రెవెన్యూ యంత్రాంగం, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీరాజ్, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులు శుభాకాంక్షలు చెప్పారు. నియోజకవర్గంలోని ఎంపీపీలు, కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు శుభాకాంక్షలు తెలుపుతూ సత్కరించారు. ముదిరాజ్ సంఘాలు వలలు, యాదవ సంఘాలు గొర్రెపిల్లలు, ఎస్సీ సంఘాలు డప్పులు, ముస్లిం సంఘాలు ఇమామే జామీన్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తనపై ప్రజలు కురిపించిన ప్రేమాభిమానాలు ఎప్పటికీ మరువనన్నారు. వారి సంక్షేమానికి, అభివృద్ధికి ఎల్లప్పుడూ పాటు పడుతానన్నారు.
కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కుంచల ప్రభాకర్, ఎంపీపీ సుష్మాశ్రీవేణుగోపాల్రెడ్డి, ఈర్ల దేవానంద్, విజయ వినయ్భాస్కర్రెడ్డి, జడ్పీటీసీలు సుప్రజావెంకట్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, కుమార్‌గౌడ్, కార్పొరేటర్లు మెట్టు కుమార్‌యాదవ్, పుష్పనగేశ్‌యాదవ్, సింధు ఆదర్శ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్‌కుమార్, ఆత్మ కమిటీ చైర్మన్ గడీల కుమార్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్లు తుమ్మల పాండురంగారెడ్డి, మాజీ ఎంపీపీలు శ్రీశైలంయాదవ్, యాదగిరియాదవ్, చంద్రారెడ్డి, వెంకటేశంగౌడ్, మైనార్టీ నాయకులు లియాకత్ అలీ, వాజిద్ అలీ, గోవర్ధన్‌రెడ్డి, రాజన్సింగ్, బీ.వెంకట్‌రెడ్డి, దశరథ్‌రెడ్డి, నల్గొండ గద్దర్ నర్సన్న, పార్టీ మండల అధ్యక్షులు ఈర్లరాజు, బీ.పాండు, హుస్సేన్, రాజేశ్, సర్పంచ్‌లు సుధీర్‌రెడ్డి, సుల్తాన్‌ఫూర్ రాజు, మన్నూరు లక్ష్మయ్య, భాగ్యలక్ష్మి, ఎంపీటీసీ గోల్కొండ నాగజ్యోతి లక్ష్మణ్, మన్నెరాజు, మేరాజ్‌ఖాన్, షఫీ, శ్రీధర్‌చారి, అక్రమ్పాష, షకీల్, అజ్మత్, పట్టణ పార్టీ అధ్యక్షుడు ఎండీ అఫ్జల్, రుద్రారం శంకర్, కొమరగూడెం వెంకటేశ్, పార్టీ మహిళా నాయకులు గూడెం యాదమ్మ, గూడెం కల్పన, యంజల మాధవి, అజ్మేరీ, రామకృష్ణ ముదిరాజ్, రవి పాల్గొన్నారు.