మెదక్ రూరల్, సెప్టెంబర్ 17 : గాంధీజీ కలలుకన్న గ్రామ స్వరాజ్యం దిశగా తెలంగాణ పల్లెలు అభివృద్ధిలో పరుగులు తీస్తున్నాయి. ప్రతి పల్లె పచ్చద నం, పరిశుభ్రతో కళకళలాడాలని ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్లెప్రగతి, హరితహారంతో రూపురేఖలు మా రుతున్నాయి. మెదక్ మండలం బాలానగర్ గ్రామం పచ్చనివనంగా మారింది. గ్రామంలోని ప్రభుత్వ పా ఠశాల, అంగన్వాడీ కేంద్రం, దుతమడుగుతండాలోని ప్రభుత్వ పాఠశాలలో నెలకొన్న సమస్యలకు పల్లెప్రగతి పరిష్కారం చూపింది. స్థానిక సర్పంచ్ ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలను పరిష్కరించి, కార్పొరేట్ పాఠశాలకు దీటుగా తీర్చిదిద్దారు. పాఠశాల భవనాలకు మరమ్మతులు చేయించి, అన్ని సౌకర్యాలు కల్పించారు.
విద్యార్థులను ఆకర్షించేలా రంగురంగుల బొమ్మలతోపాటు తరగతి గోడలపై పా ఠ్యాంశాలను బొమ్మలతో పెయింటింగ్ వేయించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి వనంగా మారాయి. పంచాయతీ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థ్ధులు ప్రతి మొక్కనూ సంరక్షించడంతో బడులన్నీ నందనవనాలను తలపిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లబోధన ప్రవేశ పెట్టడంతోపాటు సకల సౌకర్యాలు కల్పించారు. పాఠశాలలకు భగీరథ నీటిని ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన ప్రవేశ పెట్టడంతో విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది. ‘మనఊరు-మనబడి’ ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతు లను సమకూర్చడంతోపాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నదని బాలానగర్ సర్పంచ్ వికాస్కుమార్ పేర్కొన్నారు.