చేగుంట, సెప్టెంబర్14 : దళిత ద్రోహి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అంటూ దళిత ప్రజాసంఘాల నాయకులు చేగుంటలోని గాంధీ చౌరస్తా వద్ద, నార్సింగి మండల కేంద్రంలో బుధవారం దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీలో నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టాలని, తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేయడాన్ని వ్యతిరేకిస్తూ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అసెంబ్లీ నుంచి బయటకు వెళ్లిపోవడాన్ని తెలంగాణ ప్రజాసంఘాలు భగ్గుమన్నాయి.
రఘనందన్‌రావు దిష్టి బొమ్మను దహనం చేసి, దళితులకు భేషరత్తుగా క్షమాపణ చెప్పాలని,తెలంగాణ దళితప్రజాసంఘాల నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ టీఎస్ జాతీయ కార్యదర్శి ఎర్ర యాదగిరి, నాయకులు పట్నం తానీషా, జిల్లా అధికార ప్రతినిధి బాలసాయి హరిప్రసాద్, ఎంపీటీసీ నవీన్ కుమార్, ఎమ్మార్పీఎస్ రాష్ట్రనాయకులు మద్దూరి కృష్ణ, బాలకృష్ణ, మండల నాయకులు బక్క దశరథ, బండి రాములు, కుర్ర లక్ష్మీనారాయణ, జర్నల్ సింగ్, బక్క జీవన్, డప్పు వెంకటి, పొట్టి బాబు, బక్క బాలేశ్, కర్నె మహేశ్, ఎర్ర శ్రవణ్, పెండ్యాల స్వామి, నార్సింగి మండల నాయకులు ప్రభాకర్,నవీన్, నాగరాజు, దేవదాస్, రాములు, బాబు, లాలం,ఏసు,స్వామి పాల్గొనగా, ఎంపీపీ చిందం సబిత,జడ్పీటీసీ బాణపురం కృష్ణారెడ్డి,టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మైలరాం బాబు, అంచనూరి రాజేశ్,విష్ణు వర్ధన్‌రెడ్డి, భూపతి, లింగారెడ్డి, తౌర్యనాయక్, వల్లూర్ సర్పంచ్ ఆనందాస్ మహేశ్వరి సంగీభావం తెలిపారు.
నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టేందుకు తెలంగాణ శాసనసభ తీర్మా న చర్చలో ఎమ్మెల్యే దూరంగా ఉండటానికి గల కారణాలు వెల్లడించాలి. దళితులు, అంబేద్కర్‌పై బీజేపీ పూర్తి వ్యతిరేకతతో ఉందన్న విషయం శాసనసభలో రఘునందన్ వైఖరి స్పష్టమవుతున్నది. ఎమ్మెల్యే భేషరతుగా క్షమాపణ చెప్పాలి.
-గుర్రాల శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్
నూతన పార్లమెంట్ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ అధ్వర్యంలో తీర్మానం చేస్తుంటే ముఖం చాటేయడం ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు తగదు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అంటే నీకు నచ్చదా..? లేదంటే ప్రధాని మోదీ, అమిత్ షా అంటే నీకు భయమా… బీజేపీ దళిత సమాజంపై కపట ప్రేమను మాత్రమే కనబర్చుతున్నది. పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని బాహ్యంగా పేపర్ ప్రకటన చేసి ఎమ్మెల్యే నీవు నీ చిత్త శుద్ధిని చాటుకోవాల్సిన అవరం ఎంతైనా ఉంది.
-నిమ్మ నితిన్, మాల మహానాడు దుబ్బాక నియోజకవర్గం యూత్ అధ్యక్షుడు
నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టేందుకు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ తీర్మానం ప్రవేశపెడితే రఘునందన్‌రావు పాల్గొనకుండా శాసనసభలో నుంచి బయటకు పోవడం బాధాకరం. దళిత వ్యతిరేకి రఘునందన్‌రావు తన నిజస్వరూపం మరోసారి బయటపడింది. అంబేద్కర్ రాసిన రాజ్యంగం ద్వారానే ఎమ్మెల్యేగా శాసనసభకు వెళ్లిన ఎమ్మెల్యే రఘునందన్‌రావు అంబేద్కర్‌ను గౌరవించకపోవడం హేయనీయమైన ఘటన.
-కె.భీమసేన, సిద్దిపేట జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు
పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టడం ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఇష్టం లేదు. దుబ్బాక ప్రజలకు మాయ మాటలు చెప్పి గెలిచిన రఘునందన్‌రావు ఇచ్చిన హామీలను మరిచి దుబ్బాక నియోజకవర్గంలో ఇప్పటి వరకు పని చేయకుండా టీవీ షోలో మాట్లాడం తప్ప దుబ్బాక ప్రజలకు ఓరగబెట్టింది ఏమీ లేదు. దళితులంటే ఎమ్మెల్యేకు చిన్నచూపు అని తేటతెల్లమైంది. అంబేద్కర్‌ను అవమాన పరిచిన ఎమ్మెల్యేను దుబ్బాకలో తిరుగనివ్వబోం.
-డప్పు శివరాజు ,తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్