టేక్మాల్/అల్లాదుర్గం/పాపన్నపేట/పెద్దశంకరంపేట, సెప్టెంబర్ 19 : టేక్మాల్ మండలంలోని తంప్లూర్, ఎల్లంపల్లి పాఠశాలలను బుధవారం డీఈవో రమేశ్‌కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యాబోధనలో ప్రవేశపెట్టిన తొలిమెట్టు కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు సవాల్‌గా స్వీకరించి, జయపద్రం చేయాలన్నారు. ప్రతి విద్యార్థిలో అభ్యా సన సామర్థ్యాలను పెంపొందించాలని సూచించారు. ప్రాథమి క స్థాయిలో విద్యార్థులకు అన్ని అంశాలపై కనీస పరిజ్ఞానాన్ని అందించాలన్నారు. తరగతి గదిలో ఉపాధ్యాయుల విద్యాబో ధన విధానాన్ని పరిశీలించారు. లెసెన్స్ ప్లాన్, సంఖ్యాశాస్ర్తానికి సంబంధించిన రికార్డులు, ఉపాధ్యాయ అభ్యాసన పద్ధతిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట జిల్లా సెక్టోరియల్ అధికారి సుభాష్, మండల నోడల్ అధికారి శివకుమార్, ప్రధానోపాధ్యాయుడు రాంరెడ్డి, ఉపాధ్యాయులు రాములు, అనిత, ప్రవళిక, రిసోర్స్పర్సన్లు సంతోష్, శ్రీనివాస్ ఉన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారమే ఇవ్వాలని డీఈవో రమేశ్‌కుమార్ ఆదేశించారు. అల్లాదుర్గం మండలం కాయిదంపల్లిలోని ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి, ఎఫ్ఎల్ఎన్ అమలును పరిశీలించారు. ప్రతి విద్యార్థి గణితం, ఆం గ్లం, తెలుగు, హిందీలో రాయడం, చదవడం వచ్చేలా చూడాలన్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, విద్యార్థుల ప్రగతిని పెంపొందించడానికి కృషి చేయాలన్నారు. ఆయన వెంట హెచ్ఎం రాం జ్యానాయక్, ఉపాధ్యాయుడు శేఖర్, ఎస్వో సుభాష్ ఉన్నారు.
పాపన్నపేట మండలం కొత్తపల్లి ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి, తొలిమెట్టు అమలును పరిశీలించారు. పాఠశాల నిర్వహణపై హెచ్ఎం కిషన్‌ను అభినందించారు. డీఈవో వెంట టీచర్లు వెంకట్రామిరెడ్డి, సిద్దు ఉన్నా రు. పెద్ద శంకరంపేట మండలం కోలపల్లి ప్రాథమిక పాఠశాల, కస్తూర్బాగాంధీ విద్యాలయాన్ని డీఈవో తనిఖీ చేశారు. ఈ సం దర్భంగా పాఠశాలల్లో అమలవుతున్న మౌలిక భాష, గణిత సా మర్థ్యాల సాధన అంశాలను పరిశీలించారు. విద్యార్థులతో మా ట్లాడి వారితో చదివించడంతోపాటు బోర్డుపై రాయించారు. ఆయన వెంట సెక్టోరియల్ అధికారి సుభాష్, కోలపల్లి పాఠశాల హెచ్ఎం కుమార్, ఉపాధ్యాయురాలు యశోద ఉన్నారు.