జిన్నారం, జూన్ 6: ఆర్టీసీ బస్సులో ప్రయాణం అన్ని విధాల క్షేమమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నా రు. సికింద్రాబాద్ నుంచి జంగంపేట, మంగంపేట మీదు గా పలుగు పోచమ్మ వరకు నూతనంగా వేసిన జీడిమెట్ల డిపో బస్సు సర్వీసును ఎమ్మెల్యే సోమవారం జంగంపేటలో ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ ప్రయాణీకులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి తమ గమ్య స్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత రహదారులన్ని మెరుగ య్యాయన్నారు. ఆర్టీసీ ప్రయాణీకుల ను సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేర్చడమే కాకుండా కార్గో సేవలను కూడా ప్రారంభించిందన్నారు. అనంతరం జంగంపేట గ్రామంలో ఎమ్మెల్యే బస్సెక్కి టిక్కెట్ తీసుకొని కొద్ది దూరం ప్రయాణించారు. అంతకుముందు సర్పంచ్ వెంకటయ్య, ఉపసర్పంచ్ గోవర్ధన్‌రెడ్డి, స్థానికులు ఎమ్మెల్యే, నాయకులను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ ప్రభాకర్, టీఆర్ఎస్ జిల్లా యువత అధ్యక్షుడు వెంకటేశంగౌడ్, వావిలాల పీఏసీఎస్ చైర్మన్ శంకర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజేశ్, నాయకులు సార నరేందర్, శంకరప్ప, బీమ్‌రావ్, పాషా పాల్గొన్నారు.
హత్నూర : సికింద్రాబాద్ నుంచి పలుగు పోచమ్మ ఆలయం వరకు కొత్తగా ప్రారంభమైన ఆర్టీసీ బస్సుకు షేర్కాన్పల్లి సర్పంచ్ లక్ష్మీనారాయణ, టీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు సోమవారం పూజలు చేశారు. పలుగు పోచమ్మ ఆలయం వద్ద నాయకులు, గ్రామస్తులు బస్సు రాగానే కొబ్బరి కాయ కొట్టి, స్వీట్లు పంచిపెట్టారు. కార్యక్రమంలో సుదర్శన్‌గౌడ్, శ్రీనివాస్‌గౌడ్, ప్రభాకర్, వెంకటేశ్, ప్రదీప్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.