రామాయంపేట, జూన్ 13: రామాయంపేట మున్సిపల్లో పట్టణ ప్రగతి పనులు జోరందుకున్నాయి. సోమవారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్ జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఆదేశాల మేరకు మొక్కలు నాటేందుకు రోడ్లకు ఇరువైపులా ట్రాక్టర్ ద్వారా గుంతలను తీయిస్తున్నారు. పట్టణంలోని ఆరు, ఐదు, ఒకటి, పదో వార్డుల్లో వార్డు ప్రజలకు పట్టణ కౌన్సిలర్లు స్వచ్ఛతపై తమ వార్డులో అవగాహన కల్పిస్తున్నారు. కార్యక్రమాలలో మేనేజర్ శ్రీనివాస్, కౌన్సిలర్లు బొర్ర అనిల్, రాధాభవానీ, దేమె యాదగిరి, మల్యాల కవిత, గంగాధర్, శోభ, ఏఈ యుగంధర్, ప్రసాద్ ఉన్నారు.
దామరచెర్వు గ్రామాన్ని ఎంపీడీవో యాదగిరిరెడ్డి సందర్శించారు. పల్లెప్రగతి కార్యక్రమంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా అవె న్యూ ఫ్లాంటేషన్కు అనువైనా ప్రదేశాలు గుర్తించాలని పంచా యతీ కార్యదర్శి సంధ్యను ఆదేశించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పడాల శివప్రసాద్‌రావు, ఉప సర్పంచ్ దండు రమేశ్‌తో పాటు ఎంపీవో గిరిజ, కార్యదర్శి సంధ్య ఉన్నారు.
రామాయంపేట రూరల్, జూన్13 : పల్లె ప్రగతి పనులు పగడ్బందీగా నిర్వహించాలని జడ్పీ సీఈవో శైలేష్ అధికారులకు సూచించారు. సోమవారం మండల పరిధిలోని ఆర్. వెంకటాపూర్‌లో ఆయన పర్యటించారు. గ్రామంలో పల్లెప్రగతిలో చేపడుతున్న పనులు, డంప్‌యార్డు, శ్మశానవాటిక, హరితహరం నర్సరీలను పరిశీలించారు. పల్లె ప్రగతి పనుల్లో అలసత్వం చేయకూడదని అధికారులకు సూచించారు. రాబోయె హరితహరంలో అన్ని గ్రామాల్లోని రోడ్లుకు ఇరువైపుల మొ క్కలు నాటాలన్నారు. ప్రతి ఇంటికి పూలు, పండ్ల మొక్కలు ఇవ్వడం జరుగుతుందని, వాటిని పెంచేలా ఆ ఇంటివాసులు కృషి చేయాలన్నారు. కాగా గ్రామంలో పల్లెప్రగతి కార్యక్రమంలో చేస్తున్న పనులను చూసి సంతోషం వ్యక్తం చేశారు.
మనోహరాబాద్, జూన్ 13 : తడి, పొడి చెత్తను వేరు చేయడంతో పాటు ఇల్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రత్యేకాధికారి కృష్ణమూర్తి అన్నారు. కాళ్లకల్‌లో ఎంపీడీవో కృష్ణమూర్తితో కలిసి మహిళలకు తడి, పొడి చెత్తపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ పల్లెప్రగతితో స్ఫూర్తిని పొందాలన్నారు. అదే విధంగా జీడిపల్లి, చెట్లగౌరారంలో జరుగుతున్న పల్లెప్రగతి పనులను ఎంపీడీవో పరిశీలించి సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ రేఖామల్లేశ్, కాళ్లకల్ ఉప సర్పంచ్ రాజు యాదవ్ పాల్గొన్నారు.
చిలిపిచెడ్, జూన్ 13 : పల్లెప్రగతి వలన పల్లెలు, పట్టణా లు అభివృద్ధి చెందుతున్నాయని డీపీవో తరుణ్‌కుమార్ అన్నారు. సోమవారం మండలంలోని అంతారం, శీలాంపల్లి, గుజిరితండా, టోప్యితండా,గన్యతండా, గౌతాపూర్ గ్రా మాల్లో పల్లెప్రకృతి, వైకుంఠధామం, డంపింగ్‌యార్డు, నర్సరీలను, పల్లెప్రగతి పనులను తనిఖీ చేశారు. గ్రామాల్లో వీధుల్లో తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి జనార్దన్‌రావు, ఎంపీడీవో కృష్ణమోహన్, ఏపీవో శ్యామ్ కుమార్, ఆయా గ్రామాల సర్పంచులు లక్ష్మీదుర్గారెడ్డి, రాకేశ్ నాయక్, శంకర్‌నాయక్, స్వరూపవిఠల్, గ్రామ కార్యదర్శిలు పాల్గొన్నారు.
తూప్రాన్, జూన్ 13: తూప్రాన్ మండ ల వ్యాప్తంగా పల్లె ప్రగతి పనులు కొనసాగుతున్నాయి. పల్లెప్రగతిలో భాగంగా సో మవారం అన్ని గ్రామాల్లో ప్రతిరోజూ శానిటేషన్, రోడ్లు, మురికి కాలువలు శుభ్రపరచడం యథావిధిగా కొనసాగాయి. పల్లె ప్రగతిలో భాగంగా నాగులపల్లిలోఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి మొక్కను నాటి నీళ్లు పోశారు.
పెద్దశంకరంపేట, జూన్ 13 : పల్లె ప్రగ తి ద్వారా గ్రామా లు అభివృద్ధిలో ముందు కు సాగాలని ఎంపీపీ జంగం శ్రీనివాస్, మండల ప్రత్యేకాధికారి జమ్లానాయక్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని కమలాపురం, కోళ్లపల్లి, గ్రామా ల్లో పల్లెప్రగతి పనులు, నర్సరీలు, పల్లెప్రకృతి వనం తో పాటు ఎంపీపీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను వారు పరిశీలించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మురళీ పంతులు, రైతుబంధు మండల అధ్యక్షుడు సురేశ్ గౌడ్, ఎంపీడీవో రియాజొద్దీన్, సర్పంచ్‌లు, ఎంపీటీసీ స్వప్నరాజేశ్, నాయకులు మాణిక్యం, గణేష్, నర్సింహులు ఉన్నారు.
కొల్చారం, జూన్ 13 : మండల వ్యాప్తంగా పల్లెప్రగతి జోరుగా కొనసాగుతుంది. సోమవారం ఎనగండ్లలో డ్వాక్రా మహిళలతో కలిసి ఎంపీపీ మంజుల వీధుల్లో రోడ్లను శుభ్రం చేశారు.
మెదక్ మున్సిపాలిటీ, జూన్ 13: ప్రతి ఒక్కరూ శుభ్రత పాటిస్తూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ కమిషనర్ శ్రీహరి అన్నారు. సోమవారం 2, 3వ వార్డుల్లో ఆయా వార్డుల కౌన్సిలర్లు విశ్వం, వేదవతిల ఆధ్వర్యంలో వా ర్డు సభ్యులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వార్డుల్లో పర్యటించి సమస్యలను గుర్తించారు. ఈ సం దర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పట్టణాలను అభివృద్ధి కోసం పట్టణప్రగతి కార్యక్ర మం చేపట్టిందన్నారు.
పట్టణ ప్రగతితో సమస్యలు పరిష్కారమవుతున్నాయన్నా రు. ఈ సందర్బంగా వార్డుల సమస్యలతో పాటు వార్డు లో కావాల్సిన అభివృద్ధి పనులకు నిధులు కావాలని కౌన్సిలర్లు కమిషనర్ దృష్టికి తెచ్చారు. కార్యక్రమంలో ఏఈలు బాలసాయగౌడ్, సిద్ధేశ్వరి, శానిటరీ ఇన్స్పె క్టర్ బట్టి చంద్రమోహన్, వార్డుల ప్రత్యేకాధికారులు, మున్సిపల్ సిబ్బంది, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.